Sunday, August 2, 2009

తెలుగులో ... ( In telugu )

I recently found out that writing in telugu is much easier on blogspot, than using any other script! Hence, have decided to document my thoughts in telugu atleast once a week! Sometimes (actually many times) it is easier to think in your mother toungue, and now I realised it is easier to type too! Here we go..

తెలుగు లో రాయడం ఇంత సులువు అని తెలియక ఇన్నాళ్ళు పెద్దగా రాసేవాడిని కాదు. బయట దొరికే లిపి కన్నా ఇక్కడ రాయడం చాల సులువు గా ఉంది, ఇలా రాస్తుంటే చాలా సంతోషం గాను ఉంది. ఇక మీదట నుంచి వారానికి ఒక్క సారి ఆయినా తెలుగు లో రాయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.

తెలుగు లో రాస్తునాను కాబట్టి, ఆంధ్ర ప్రదేశ్ కు సంబందించే ముఖ్యంగా రాయడం జరుగుతుంది ఇక్కడ. వారానికే ఒక్కటే రాస్తుంటా కాబట్టి, అన్ని విషయాలు సంక్షిప్తంగా, కుదిరినప్పుడు వ్యంగంగా కుడా రాయడానికి ప్రయత్నిస్తా! ప్రయత్నం లో తప్పు లేదు కదా ;-)

ఇక పొతే, ఈ వారం అంతా అసెంబ్లీ సమావేశాలు మీదనే చాల వరకు చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే, ఈ వారం అసెంబ్లీ చూస్తుంటే కొంచం హాయి గా అనిపించింది. సభ్యులు కొన్ని చక్కటి ప్రశ్నలు అడిగారు, మంత్రులు కూడా చాల వరకు బానే సమాధానాలు ఇచ్చారు కూడా. బడ్జెట్ మీద కూడా చర్చ జరిగింది. ఈ చర్చ లో నాకు కూడా కంది పంట కి సంభందించి మంచి వివరాలు తెలిసాయి.

సమావేశాల్లో "ఆకట్టుకునే" సంఘటనలు కూడా చోటు చేసుకునాయి. ముఖ్య మంత్రి గారు సందర్భం లేకుండా నాయుడు గారిని రేచగోట్టడం, నాయుడు గారు అదే స్వరం లో "ఫస్ట్ టైం ఛాలెంజ్, సెకండ్ టైం ఛాలెంజ్, థర్డ్ టైం ఛాలెంజ్" అని తోడ కొట్టకుండానే, తోడ కొట్టినట్టు చెప్పడం వీక్షలుకి పాఠకులకి వినోదాని అందించారు! బహుసా బాలకృష్ణ తన బాష ని నాయుడు గారి మీద రుద్దినట్టు ఉన్నారు! చిరంజీవి గారు ఈ వారం పెద్దగా ఏమి మాట్లాడలేదు, బహుశా వచ్చే వారం లో అయిన గళం విప్పుతారు ఏమో చూడాలి.

ఈ సారి వర్షం రాష్ట్రాన్ని కరుంచలేదు. ఈ మధ్య కాలం లో ఎన్నడు లేనంత విధంగా, సాధారణం కంటే 49% తక్కువ పడింది. ఈ నెల కూడా ఇలాగే ఉంటే, కరువు ప్రకటించి రావాల్సి వస్తుంది. ప్రభుత్వం ప్రస్తుతానికి రైతులు కి సబ్సిడీ రేట్లు మీద విత్తనాలు ఇవ్వడానికి నిర్యంచింది. తొమ్మది గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఇక లేనట్టే భావించాలి మనం. ఈ వరం లో పరిస్థితుల్ని బట్టి ప్రభుత్వం ఏమి చేస్తుందో వేచి చూడాలి.

ప్రస్తుతానికి ఇక్కడితో ఆపెస్తా. మొదటి సారి రాస్తున్న కాబట్టి, మీ అభిప్రాయం చెప్తే, వచ్చే సారి నుంచి మరింత మెరుగ్గా రాసే అవకాశం ఉంటుంది. వచ్చే వారం వరకు సెలవు మరి !

4 comments:

Wake Up, Folks! said...

Mulayam Singh alleges discrimination against UP (on gas allocation)

http://www.hindu.com/2009/08/04/stories/2009080458040100.htm


Even UP people demanding their share of KG Gas. Only people who don't seem to be concerned are Andhras! No one talks of our rightful share or of the pittance that we get as royalties. God save us!

Sudhir said...

Well, Mulayam is fighting because it is Anil Ambani's stake that is at stake here, otherwise I see no reason why he would even think of raising this issue.

On a lighter note, the opposition in Andhra is now talking about this "discrimination", and the ruling party is asking whether the opposition slept while it was in power!! And so the story goes on...

I think it all boils down to what YSR thinks... if he/Congress party gets to benefit from this, he will go to any extent to try and get this done. If not, he will not give a damn about we not getting our rightful share!

Unknown said...

Congress was up in arms when there were no rains in Naidu's time. Until last year there was no problem with rains hence no headache for Congress. Ippudu inka valaki "Infront crocodiles festival". Whoever may be at the helm, it's the farmers that are effected. Since this happens quite often, couldn't the govt. chalk out plans to tackle it permanently or is that something next to impossible?

Unknown said...


for more information about packers and movers of gurgaon click on the one of the following link:
packers and movers in gurgaon
movers and packers in gurgaon
packers and movers gurgaon
movers and packers gurgaon
http://www.top8list.in/packers-movers-gurgaon/

Post a Comment