Sunday, August 30, 2009

అదన్నమాట! : ఆగస్ట్ 23-29

1. రచ్చ గెలిచాం, ఇక ఇంట గెలుద్దాం! పోయిన వారం లో రవీంద్ర భారతి లో తెలుగు భాష ప్రశస్తి మీద ఒక నృత్య రూపకం ప్రదర్శించడం జరిగింది. ఒక నృత్య రూపకం చూడడం ఇదే మొదటి సారి నాకు. అదీ బాష మీద అంటే ఎలాగ ఉంటాదో అనే ఆసక్తి తో వెళ్ళాను. ఒక ఆలోచన కి వాచికం, ఆంగికం తోడు అయితే ఆ ఆలోచన ని ఎంత ముచ్చట గా తీర్చిదిద్దవచ్చో ఈ రూపకం చూసాక అర్ధం అయ్యింది. కావాలి అంటే ఒక స్లైడ్ షో గా పెట్టి చుపించేయచ్చు, కాని ఇలా మన కళ సహకారం తో భావాన్ని వ్యక్తపరచడం అనేది అంత సులువు అయిన పని ఏమి కాదు. తెలుగు బాష ప్రయాణాన్ని అత్యుతమ ప్రమాణాలతో నృత్యకారులు, చిన్న పిల్లలు, కళ్ళకు అద్దినట్టు చూపించారు. రచన గురుంచి ప్రత్యేకంగా చెప్పాలి. మన బాష కే పరిమితమైన ప్రాస ని చాల చక్కగా వాడి, ప్రేక్షకులలో ఒక రకమైన ఆనందాన్ని నింపారు. గౌతమి పుత్ర శాతకర్ణి హయాం లో తెలుగు బాష ఎలా వెలిగిందో చాల చక్కటి అభియనం తో చూపించారు. అన్ని నృత్యాలలో ఈ భాగం చాల బాగుంది. చివరికి, మాత్రు బాష ని చిన్న చూపు చూడవద్దు అన్న విన్నపం తో ఈ రూపకం ముగిసింది. ఈ మధ్యే తెలుగు కి ప్రాచీన హొదా కలిపించారు. ఆ సందర్భాన్ని దృష్తి లో పెట్టుకుని, ముఖ్య అతిధి గా వచ్చిన మండలి బుద్ధ ప్రసాద్ గారు ఇలా చెప్పారు - రచ్చ గెలిచాం, ఇక ఇంట గెలుద్దాం ! నిజమే, మన బాష మీద మన వాళ్ళకు ఉన్న అంత వ్యతిరేకత మరే బాష వాళ్ళకి ఉండదు ఏమో. పరాయి బాష ని నేర్చుకోవద్దు అని కాని, గౌరవించవద్దు అని కాని ఇక్కడ చెప్పటం లేదు. మనం పుట్టి పెరిగిన బాష మీద అంత అభద్రతా భావం ఎందుకో?

2. "నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం". ఈ మాట ఎ కామెడి ఆర్టిస్ట్ అనలేదు అండి. జంధ్యాల గారు ఈ వాక్యాన్ని ప్రసిద్ది లోకి తెచ్చాక, మొట్ట మొదటి సారిగా అసందర్భంగా సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారే వాడరు. ప్రతి దానికి అల నవ్వుతూనే ఉంటారు అని నాయుడు గారు ఎద్దేవా చేస్తే, రెడ్డి గారు పై విధంగా స్పందించారు. నిజమే ముఖ్యమంత్రి గారు, నవ్వడం ఒక భోగమే , కాని ప్రతి విషయానికి నవ్వడాన్ని ఏమని అంటారో మాకు తెలిదు, దయ చేసి అదీ కూడా కొంచం సెలవు ఇస్తారా? విపక్షాలు లేవనెత్తే ప్రతి విషయం మీకు హాస్యాస్పదమే అనిపిస్తే, సూటి గా ఆ మాటే చెప్పచ్చు కద?

3. అసెంబ్లీ లో జెపి గారు ఒక బిల్ ని వ్యతిరేకిస్తూ, ఇది రాజ్యాంగానికి విరుద్దంగా అని ఉంది అని చెప్పారు. ప్రభుత్వ సమాధానం ఏంటో తెలుసా ? అయితే కోర్ట్ కి వెళ్ళండి ! మంత్రి గారే ఇలా సమాధానం చెప్పితే ఇంకా ఎవడికి చెప్పికుంటాం ? మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం, ఎం చేసుకుంటారో చేసుకోండి అన్న ముఖ్యమంత్రి గారి వ్యక్తిత్వం ఇప్పుడు మంత్రులు కి కూడా అంటుకుంటుంది అన్నమాట.

4. బాలకృష్ణ కి పార్టి లో పెద్ద స్థానం ఈ ఇస్తునారు అని చాల ఉహాగానాలు వచ్చాయి ఈ వారం లో. ఇది ఒక్కటే మిగిలింది మనకి చూడడానికి ఇంకా.అయిన వచ్చాక ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో మనకి మరి ! తలుచుకుంటేనే భయం వేస్తుంది!

5. పిఅర్పి పెట్టి మొన్న 26 కి ఏడాది గడిచింది. చిరంజీవి గారు, ఈ ఏడాది లో మీరు సాదించింది దాదాపు శూన్యం, పోగాట్టుకుంది మాత్రం చాల అమితం. వచ్చే ఏడాది కల్లా మీరు చేసిన తప్పులు నుంచి ఎలా బయటకు వస్తారో చూడాలని ఉంది.