Monday, August 10, 2009

అదన్నమాట! : ఆగస్ట్ 2-8

1. మొన్న ఆ మధ్య బిజినెస్ లైన్ పత్రిక సంతూర్ సోప్ గత 16 ఏళ్ళు గా ఒకటే ఐడియా తో టీవీ లో యాడ్స్ ఇస్తూ సక్సెస్ ఎలా సాధించారో వివరించింది. అసెంబ్లీ లో మన ముఖ్యమంత్రి గారు కుడా గత 5 ఏళ్ళు గా ఒకటే ఐడియా తో ప్రతిపక్షాలు మీద ఎదురు దాడి చేస్తునారు . ఎటువంటి సందర్భమైన సరే, ఎటువంటి సమస్య అయిన సరే, ఎటువంటి ప్రశ్న అయిన సరే, చంద్రబాబు నాయుడు మీదకి మళ్ళిస్తారు. ఎర్పోర్ట్ గాస్ చార్జీలు గురుంచి అడిగితె, నాయుడు గారు ఎన్నికల్లో ఓడిపోయాక EVM మీద ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతారు! ధరలు పెరుగుతున్నాయి అంటే మల్లి ఎన్నికలు పెడదాము, ఛాలెంజ్ అంటారు. కండి పప్పు మీద ప్రశ్నలు వస్తుంటే, నాయుడు గారి హయాం లో ఉల్లి ధరలు మీదకు చర్చను ని మళ్ళిస్తారు. వాళ్ళు తప్పులు చేసారు కాబట్టే ప్రతిపక్షం లోకి వెళ్లారు ముఖ్యమంత్రి గారు, మీరు అదే తప్పులు చేసి భుజాలు తడుముకుంటే ఎలా?

2. "మాకు అవకాశం దొరకటం లేదు, మాకు మాట్లాడే సమయం దొరకటం లేదు" అని తెగ కంప్లైంట్స్ ఇచ్చారు చిరంజీవి గారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఒకర్ని ఒకరు తిట్టుకోవడం తోనే సరిపోతుంది అని విమర్శించారు. తీరా బడ్జెట్ మీద మాట్లాడానికి 20 నిమషాలు టైం ఇస్తే, కేవలం 15 నిమిషాల్లో ముగించేసారు! రాష్ట్ర బడ్జెట్ మీద కనీసం 20 నిమషాలు కుడా మాట్లడలేరా చిరంజీవి గారు? పోనీ వాళ్ళిద్దరూ "తిట్టుకోకుండా" ఉండే సమయం లో మీ పార్టీ ఎంత వరకు పాల్గుందో మీ విజ్ఞత కే వదిలేస్తునాం.

3. గత రెండు వారాల్లో అత్యంత హాస్యాస్పదమైన సంఘటనలు ఇవి - కృష్ణంరాజు గారు "ప్రజా సేవ" చెయ్యలేక ప్రజా రాజ్యం పార్టీ ని విడిచి వెళ్లారు! మూడే నెలల్లో పార్టీ లోకి రావడం, పోటి చెయ్యడం, ఓడిపోవడం, తిరిగి వేల్లిపోఅవడం జరిగిపోయాయి! మీ సినిమాల్లో విల్లన్స్ కుడా ఇంత త్వరగా రంగులు మార్చారు ఏమో! రెండో వార్తా ఏంటి అంటే, విజయశాంతి గారు మల్లి తల్లి తెలంగాణా పార్టీ ని పునరుద్దరిస్తారు అంట! వీళ్ళ ఇద్దర్ని పెట్టి మంచి సినిమా ఒకటి తీయచ్చు ఏమో - "ఫిరాయింపుల రాజ్యం".

4.చిరంజీవి గారు, నేతల్ని పుట్టించడానికి మీ పార్టీ ఆవిర్భవించింది అనుకున్నాము. కాని నేతల్ని దత్తత తీసుకోవడానికి ఆవిర్భవించింది అని తరువాత ఆలస్యంగా తెలిసింది. మిమ్మల్ని ప్రేమించి, అభిమానించి, నమ్మి, మీ అభివ్రిది కి సహకరించిన అభిమానుల్ని నమ్మకుండా, స్వార్ధ రాజకీయ నాయకుల్ని ని నమ్మరు. ఇప్పుడు ఏమో మీరు తవ్వుకున్న గొయ్యి లో మీరే పడ్డారు. బయటకు రావడానికి ఎవారి సహాయం తీసుకుంటారో చూడాలని ఉంది... మిమ్మల్ని నమ్మిన వాళ్లదా ? మీరు నమ్మిన వాళ్లదా ?

6 comments:

SysErr said...

aanglabhaashaa penutuphaanuki reparepa laadutunna telugubhashaa depanni kapaade LIC logo lanti vadivi mama nuvvu.

Teja said...

hahahahahahha...good comment SysErr. Good job Sudhir, baga rastunavu ra...alage velutu vundu
(keep going).

Sinnuu... said...

anna...nuvvu telugu lo intha baagaaa rayadam assalu suuper anna....nenayitey shock assalu.....

shiv shankar said...


for more information about packers and movers of gurgaon click on the one of the following link:
packers and movers in gurgaon
movers and packers in gurgaon
packers and movers gurgaon
movers and packers gurgaon
http://www.top8list.in/packers-movers-gurgaon/

shiv shankar said...

for more information about packers and movers of noida click on the one of the following link:
packers and movers in noida
movers and packers in noida
packers and movers noida
movers and packers noida
http://www.top8list.in/packers-movers-noida/

Badal Rain said...


movers and packers noida
packers and movers in gurgaon
packers and movers in bangalore
packers and movers noida
packers and movers gurgaon

Post a Comment