1. కరీంనగర్ లో చిరంజీవి గారు మైక్ పట్టుకుని మరి గట్టిగా చెప్పారు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని. దేని గురుంచి? మహారాష్ట్ర లో నిర్మించబడుతున్న బాబ్లి ప్రాజెక్ట్ గురుంచి. మనకి తెలియని విషయం కూడా ఒకటి చెప్పారు. బాబ్లి ప్రాజెక్ట్ పూర్తీ అయితే, ఆ ప్రాంతం అంటా ఎడారి అయ్యిపోతుంది అంట. ఇప్పుడు నాకు ఒక డౌట్. ప్రజలు ముందు ఉన్న మీ స్వరం లోని తీవ్రత అసెంబ్లీ లో ఎందుకు మూగపోతుంది సార్ ? అక్కడే సూటిగా, నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిచవచ్చు కదా? ఇప్పుడు సమావేశాలు జరుగుతునాయి కదా, అక్కడే గట్టిగా చెప్పరేం? "ఎడారి లాగ మారిపోయే అంత నిర్ల్యక్షం" తో ప్రభుత్వం ఉంటే, మీరు కనీసం చర్చ కోసం పట్టుబట్టారా చిరంజీవి గారు?
2. ఈ మధ్య విగ్రహం అనే పేరు వింటూనే, మాయావతి గారు చేసే అరాచకమైన విగ్రహావిష్కరణలు గుర్తు వస్తాయి. కాని వీటికి భిన్నంగా, కర్ణాటక మరియు తమిళనాడులు ఒక మంచి విగ్రహ దౌత్యం కి తేరా లేపాయి. ప్రముఖ తమిళ కవి తిరువల్లార్ విగ్రహాన్ని బెంగలూరు లో, ప్రముఖ కన్నడ కవి సర్వజ్ఞ విగ్రహాన్ని చెన్నై లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆవిష్కరించారు. కల కి, కళాకారులు కి ఇలా మైత్రి ని పెంచే శక్తి ఉంది మరి. అంతే కాదు, ఆ విగ్రహాలు ద్వార వాళ్ల గురుంచి తెలుసుకోవాలి అనే ఆత్రుత కూడా పెరుగుతుంది. మన రాష్ట్రం చుడండి. ఇందిరా గాంధి, రాజీవ్ గాంధీ విగ్రహాలు తప్పించి వేరే మాటే ఉండదు.
ఈ వారం లో భద్రాచలం లో కుడా రాజీవ్ గాంధి విగ్రాహ్ని ఆవిష్కరించారు అంట. ఇదేం దారుణం అని ప్రశ్నించే నాదుడే కరువుయ్యాడు. ప్రశ్నించిన మన ముఖ్యమంత్రి "ఎవడి మాట వినరు" కదా!
౩. అసెంబ్లీ సమావేశాలు జరుగుతునంత కాలం మనకి ఆహ్లాదానికి కొదవ ఉండదు. ముఖ్యమంత్రి గారు లెగిసి, దయాకర్ రావు గార్ని "మరి రౌడి లాగ మాట్లడతావెంతయ్యా , కూర్చో" అని అన్నారు. దీనికి నిరసన తెలిపినందుకు దయాకర్ రావు గార్ని సస్పెండ్ చేసారు! అంతే కాదు, దీనికి ముఖ్యమంత్రి గాడు కొత్త అర్ధం చెప్పారు. తను అల అనలేదు అని, "రౌడి లాగ మాట్లాడతారు ఏంటి అయ్యా" అని అన్నారు అంట. అయ్యా అంటే ఇంగ్లీష్ లో సార్ అని అర్ధం అంట, అందువల్లన అయిన ఏమి తప్పు అనలేదు అంట. ఎం చేస్తాం, ఖండిస్తాం.
4. కరువు రాష్ట్రం లో భయంకరంగా ఉంది. సాధారణం కంటే 55% తక్కువ వర్షం నమోదు అయ్యింది ఇప్పటి వరకు. ఖరిఫ్ పంట ఇంక పోయినట్టే అనే కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. రబీ పంట కి ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలి అని యోచిస్తుంది. ముఖ్యమంత్రి గారు మాత్రం కరువు ప్రాంతాలు గా 1014 మండలాలను ఈ నెల ఆఖరు వరకు ఆగి అప్పుడు ప్రకటిస్తారు అంట. ఈ జాప్యం ఎందుకు అని అడగకండి, అది అంతే.
5. మీ అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు :).
1 comments:
for more information about packers and movers of gurgaon click on the one of the following link:
packers and movers in gurgaon
movers and packers in gurgaon
packers and movers gurgaon
movers and packers gurgaon
http://www.top8list.in/packers-movers-gurgaon/
Post a Comment