Sunday, April 15, 2012

అదన్నమాట! ఏప్రిల్ 8-14


వైఎసార్ గారిని తిట్టాలా వద్దా ? ఇది ఇప్పుడు కాంగ్రెస్స్ ని వేధిస్తున్న ప్రశ్న. ఎప్పటి లాగే ఒక వర్గం ఏమో తిట్టాలి అని, ఇంకో వర్గం ఏమో తిట్టకూడదు అని వాదించు కుంటున్నాయి. జగన్ అవినీతి ని యైఎసార్ అవినీతి ని వేరు గా చూడకూడదు అని కొందరు భావిస్తున్నారు. ఈ కొందరు లో చిరంజీవి గారు కూడా ఉన్నారు. ఈ వారం అంత వాదించుకున్నారు. ఇంకా ఏమి తేల్చలేదు ఈ కాంగ్రెస్స్ వాళ్ళు ! 

వీళ్ళు ఏది తేల్చిన వీళ్ళకి నష్టమే. వైఎసార్ గారు ఉన్నంత కాలం ఏమో విర్రవీగారు, విచాలవిది గా డబ్బులు సంపాదించారు. ఇప్పుడు ఏమో జగన్ గారు సోనియా గాంధి ని తిట్టినందుకు , అప్పట్లో జగన్ ఒక్కడే బాగా లబ్ది పొందినట్టు చెప్తున్నారు! వినే వారు ఉండాలే కాని, ఎంతకైనా తెగిస్తారు ఏమో వీళ్ళు ! అదన్నమాట!

0 comments:

Post a Comment