ముఖ్యమంత్రి గారు కరెంట్ చార్జీలు పెంచారు. దాదాపు పది ఏళ్ల తరువాత కరెంట్ చార్జీలు పెరిగాయి. ఎప్పటికీ అప్పుడు చార్జీలు పెంచితే ఈ బాధ ఉండదు కదండీ? కాని మన పాలకులు ఆ పని చెయ్యరు. ఒకే సారి ఎక్కువగా పెంచేస్తారు చార్జీలు. దీనికి బదులు గా సంవత్సరం కి ఒక సారి కొంత శాతం పెంచుతూ ఉంటె, ఏ ఇబ్బంది ఉండదు కదా!
"జగన్ అక్రమాస్తుల కేస్" అంటే ముందు ఎవర్ని ప్రశ్నించాలి అండి ? ఒక వేల ఆ కేస్ లో అర్రెస్ట్ జరిగితే ముందు ఎవర్ని అర్రెస్ట్ చెయ్యాలి అండి ?
పై రెండు ప్రశ్నలకి నా సమాధానం అయితే జగన్. కాని మన రాష్ట్రం లో ఏమి జరిగిందో తెలుసా? కేస్ ఏమో ఆయన అక్రమంగా ఆస్తులు సంపాదించారు అని వేసారు. అయన అకౌంటంట్ ని అర్రెస్ట్ చేసారు. అయన పత్రిక ని విచారించారు. కాని అయన ని మాత్రం ప్రశ్నించలేదు. "జగన్ అక్రమాస్తుల కేస్" లో ఇప్పటి వరకు జరిగిన అర్రేస్ట్లు లో జగన్ గారి పేరే లేదు ! ఇదేం విడ్డూరం అండి?
జగన్ గారు ఏమో ఇంకా ఓదార్పు యత్రలోనే ఉన్నారు. ఎన్నాలు ఒడార్స్తారు అండి? సిబిఐ వాళ్ళు చార్జిషీట్ కూడా దాఖలు చేసారు కోర్ట్ లో. కాని జగన్ మాత్రం బయటే తిరుగుతునారు. ఆయనను నమ్మి సహకరించిన వాళ్ళు మాత్రం జైలు లో ఉన్నారు! అదన్నమాట!
0 comments:
Post a Comment