Sunday, April 29, 2012

అదన్నమాట! ఏప్రిల్ 22-28


రాష్ట్రం ఈ వార ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాలకి సంబందించినది కాదు! 

ఇంటర్మీడియట్ రెండో ఏడాది పరీక్షలలో ఈ సారి ఫిసిక్స్ పేపర్ చాల చాలా కష్టం గా ఇచ్చారు అని అన్ని వర్గాల వారు విమర్శించారు. అసలు సిలబస్ లో లేని ప్రశ్నలు చాల ఇచ్చారు అని చెప్పుకొచ్చారు. ఫలితాలు విడుదల అయ్యాయి ఈ మధ్య - రాసిన వాళ్ళలో 31% మంది ఈ పరీక్ష తప్పారు అంట. చాల మంది కి తక్కువ మార్కులు కూడా వచ్చాయి. లక్షలలో రాస్తే, కేవలం దాదాపు 600 మందికే 60 కి 60 వచ్చాయి అంట. దీనితో ఇంకా పెద్ద దుమారం ఈ రేగింది రాష్ట్రం లో. 

కాని మంత్రి గారు మాత్రం ప్రశ్నలు అన్ని ప్రబుత్వం చెప్పిన పుస్తకం నుంచే వచ్చాయి అని చెప్పారు. పేజి నంబర్లతో సహా చూపించారు. ప్రైవేటు కళాశాలలు వాడే పుస్తకాల్లో అలాంటి ప్రశ్నలు లేకపోతె ఎవరిదీ తప్పు అని అడగకనే అడిగారు. అప్పటికి 21 నుంచి 18 కి తగ్గించారు కూడా పాస్ మార్కుని. మంత్రిగారు మాత్రం ససేమిరా అన్నారు, గ్రేసు మార్కులు ఇవ్వడానికి. 

ఇంతలో ఏమైందో - చరిత్ర లో మొదటి సారి, ఇంటర్మీడియట్ రెండో ఏడాది పరీక్షకి కుడా ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసుకునే వెసులుబాటు కలిపించారు. మొదటి ఏడాది విద్యార్దులకే ఇది ఇంత వరకు వర్తిస్తు వచ్చింది. మొదటి ఏడాది వాళ్ళు రాస్తే, అన్ని రాయాలి. కాని ఇప్పుడు, కేవల ఈ ఏడాది కి మాత్రమె, రెండో ఏడాది విద్యార్ధులు ఏ ఒక్క పేపర్ కోసం ఇంప్రూవ్మెంట్ రాసుకోవచు అంట. ఎంసెట్ అయ్యాక ఈ పరీక్ష పెడతారు. ఇంకా ఈ సారి పెట్టబోయే ఫిసిక్స్ పరీక్ష కష్టం గా కాకుండా, సులువు గానే ఇస్తారు అని మనకి అర్ధం అయ్యిపోయింది కదా అండి! 

ఇక పొతే, కేంద్ర ఎన్నికల సంఘం మన రాష్ట్రం లో 18 అసెంబ్లీ స్థానాలకి 1 లోక్ సభ స్థానం కి జరగబోయే ఎన్నికలకి తేది ప్రకటించింది. జూన్ 12 న ఎన్నికలు ! ఇక అన్ని పార్టీలు కసరత్తులు ముమ్మరం చేసాయి. కాని ఈ సారి కూడా కాంగ్రెస్స్ కి, తెదేపా కి భంగపాటు తప్పేటట్టు లేదు. వేచి చూడం మరి ఏమౌతుందో . 

ఇంకో పెను మార్పు - డాక్టర్ రాజశేఖర్ మరియు శ్రీమతి జీవిత రాజశేఖర్ భారతీయ జనత పార్టి లో చేరారు. అదన్నమాట! 

0 comments:

Post a Comment