Sunday, April 22, 2012

అదన్నమాట! ఏప్రిల్ 15-21

కాంగ్రెస్ అధిష్టానం వారు ఈ వారం ఇంకో నాయకుడుని ఇక్కడికి పంపిచారు. శ్రీ వాయలార్ రవి గారు డిల్లి నుంచి వచ్చారు. నాలుగు రోజులు ఉన్నారు. చాలా మంది నాయకుల్ని కలిసారు. అందరు అవే సమస్యలు మళ్ళి మళ్ళి వివరించారు. బొత్స గారు, కిరణ్ గారు సరిగ్గా నడిపించటం లేదు అనేది వారి సారంశం. ఈ పాత మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. కొత్త ఏమి ఉంది చెప్పండి ! పోనీ రవి గారు ఏమైనా కొత్త పరిష్కారం చూపించార అంటే, అదీ లేదు! ఎందుకు వచినత్తో, ఎందుకు వేల్లినత్తో మరి! అధినేత్రి కి నివేదిక ఇవ్వడానికే అయితే, ఆజాద్ గారు ఉన్నారు కదా? కోతగా రవి గారిని ఎందుకు పంపిచారు ? ఉప ఎన్నికలలో గెలవడానికి డిల్లి నుంచి నాయకులు వచ్చి నివేదికలు ఇస్తే ఎలా అండి? నియోజకవర్గం లో ప్రజలతో ఉండండి - గెలిచే అవకాశాలు మెరుగుపడతాయి! అదన్నమాట! 

0 comments:

Post a Comment