Sunday, January 3, 2010

అదన్నమాట!: డిసంబర్ 27 - జనవరి 2

1.కాంగ్రెస్స్ పార్టి ఎపట్లాగే మళ్ళి పి.వి. నరసింహ రావు గారిని మర్చిపోయింది. మర్చిపోవడం కన్నా విస్మరించింది అనడం సబబు. ఆ పార్టి 125 వార్షికోత్సవ సభ లో మేడం సోనియా గాంధి గారు అసలు అయన పేరు కూడా తీయలేదు. ఇంకో అడుగు ముందుకు వేసి, సంస్కరణలకు ఆద్యుడు రాజీవ్ గాంధి అని సెలవు ఇచ్చారు. మీ అబద్దాలను ప్రస్నిచే వాళ్ళు లేరనే కదా మేడం మీరు ఇలా మాట్లాడుతున్నారు ?

2. అసలు ఈ విద్యార్ధి నాయకులూ ఎవరండి ?? గంట గంటకి ఉస్మానియా జే ఏ సి ఇలా చెప్పింది, అలా చెప్పింది అని వింటూనే ఉంటాము. జే ఏ సి బంద్ కి పిలుపు ఇచ్చింది అని వింటాము. జే ఏ సి ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది అని వింటాము, జే ఏ సి ఇలా హెచ్చరించింది, అలా హెచ్చరించింది అని వింటాము. కాని అసలు నాయకులు ఎవరు? అసలు ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు రెచ్చగొడుతున్నారు ? సభలు ఎవరు నిర్వహిస్తున్నారు? నిరసనలు ఎవరు నడిపిస్తున్నారు? రేపొద్దున్న ఒక వేల చర్చలకు పిలవాలి అంటే అసలు ఎవర్ని పిలవాలి? జరుగుతున్న అరాచకానికి ఎఅవ్ర్ని బాధ్యులు చెయ్యాలి ?? నాయకులూ లేకుండా రోజుల తరబడి విద్యార్ధులు ఇలా చేస్తున్నారు అంటే నమ్మసఖ్యంగా లేదు. ఇప్పటికైనా వెనక ఉండి ఇంహ్త మంది జీవితాలతో ఆడుకుంటున్న ఆ అరాచక సఖ్తులు ఎవరో బయటకి రావాలి, లేకపోతె ప్రబుత్వం వాళ్ళ పేర్లు తెలియచెయ్యాలి. రాష్ట్రం లో ఇంత అనిశ్చిత పరిస్థితి నెలకొనడానికి కారణమైన ఈ నాయకులూ ఎవరో తెలియాల్సిన అవసరం ఇబ్బంది పడుతున్న ప్రజలకి ఎంతైనా ఉండి.

ఇది ఇలా ఉండగా, కేంద్ర హొం మంత్రి శ్రీమాన్ చిదంబరం గారు అన్ని పార్టీలను చర్చలకు ఆహ్వానించారు. ఎం చర్చిన్చాలో చర్చించడానికి పిలిచారు అంట. కనీసం ఈ చర్చల వాళ్ళ అయిన కొంచం శాంతి భద్రతలు మెరుగు పడతాయి అని ఆశిద్దాం. అలాంటి అవకాశాలు తక్కువే అని నాకు తెలుసు, కాని ఆశ ఆశే కదా!

0 comments:

Post a Comment