Sunday, January 31, 2010

అదన్నమాట! : జనవరి 24-30

రాజకీయాల గురుంచి చర్చించే ముందు ఒక విషయం. మాయాబజార్ మళ్ళి విడుదల అయ్యింది. ఈ సారి కలర్ లో. పెద్ద స్క్రీన్ మీద కలర్ లో ఎస్వీఆర్ ఎన్టీఆర్ సావిత్రి ని చూస్తుంటే ... అబ్బో అదీ ఒక మంచి అనుభూతి. అవకాసం దొరికితే తప్పకుండ చుడండి ధియేటర్ లో.

ఇక పొతే, మన తెలంగాణా విషయానికి వద్దాము. మాన్యశ్రీ చిదంబరం గారు ఇంకో వారం లోపల ఒక కమిటీ వేస్తాము అని చెప్పారు. అదీ ఎం చేస్తది, ఎన్నాలు కూర్చుంటుంది అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. దీంతో సంతృప్తి చెందినా కాంగ్రెస్స్ నేతలు రాజీనామాలు వెనక్కి తీసుకుంటాము అని చెప్పారు. కాని, జేఏసీ అనే ఒక విష పురుగు ఉంది కదండీ మనకి..వాళ్ళు మళ్ళి ఏదో రేచాగోట్టే వ్యాఖ్యలు చేసారు. రాజీనామాల మీద తుది నిర్ణయం ఇంకో వారం పాటు పొడిగించారు. ఈ వారం లోపల అంకున్నది జరగకపోతే రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తారు అంట. ఇది ఇలా ఉండగా, స్పీకర్ గారు అన్ని రాజీనామాలను తిరస్కరించారు. ఒక్కటి మినహా. ఆ ఒక్కటి ఎవరిదో చెప్పడానికి నిరాకరించారు. దీనితో "రాజ్యంగా సంక్షోభానికి" కూడా తెర పడింది. కాని దురదృష్టం ఏంటి అంటే, తెలంగాణా వివాదానికి ఇప్పుడు అప్పుడే తెర పడేటట్టు లేదు.

ఇది ఇలా ఉండగా, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. కాని వీటి గురించి చర్చించే వాళ్ళు కాని, చర్యలు తీసుకునే వాళ్ళు కాని ఎవ్వరు లేరు. మీ గోడు మీరు పదండి, మా గోడు మేము పడతాము అన్నట్టు ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. అటు కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేస్తాడ అని చుస్తే, వాళ్ళు అసలు మా సమస్యే కాదు అని తేల్చి చెప్పారు!

1 comments:

Arun said...

Offtopic -- Sun Microsystem (now part of Oracle) CEO Jonathan Schwartz sends his resignation over Twitter.

Post a Comment