Sunday, January 24, 2010

అదన్నమాట! : జనవరి 17-23

ఒక విద్యార్ధి శవం దొరికింది. కాలిపోయి ఉంది. పక్కనే ఉత్తరం ఒకటి ఉంది. తెలంగాణా ఎప్పుడు వస్తుందో తెలియక ఆత్మా హత్య చేసుకుంటున్నాడు అని రాసి ఉంది అందులో. దేహం కాలిపోయింది కాని కాగితం కాలలేదు. శవం కుడా రోడ్ పక్కన దొరికింది. ఇంక అరాచక శక్తులు ఎందుకు ఆగుతాయి అండి ? మొదట ఒక బంద్ కి పిలుపు ఇచ్చారు. 48 గంటలు అది కూడా. ఆ తరువాత ఆ శవం ని ఉస్మానియా ఉనివర్సిటి కి తీసుకు వచ్చారు. అక్కడ శవం ముందు ధర్నా కి కూర్చున్నారు. ఆ తరువాత శవాన్ని ఊరేగింపు గా వాళ్ళ సొంత ఊరు తీసుకు వెళ్దాం అని ఇంకో డ్రామా కి తెర లేపారు. పోలీసు తో గొడవ కి దిగారు. రబ్బర్ బుల్లెట్ కూడా పోలీసులు వదిలారు. మధ్యలో మన నీచ రాజకీయ నాయకులూ కుడా వచ్చారు. కాని పెద్దగా ఎవరు వారిని పట్టించుకోలేదు. బంద్ ని కూడా ప్రజలు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కొత్తగా రాజకీయ జేఏసీ 28 లోపల తాడో పేడో తేల్చాలి అని చెప్పారు. దీన్ని కూడా ఎవరు సీరియస్ గా తీసుకోవటం లేదు.

ఇది ఇలా ఉండగా, విధ్యార్డుల్ని ఉద్దేస్తూ మన కేసీఆర్ గారు మాట్లాడుతూ, తెలంగాణా కోసం మా తలలు కూడా బలి ఇష్టం అని ప్రగల్భాలు పలికారు. విద్యార్ధులు "ఎప్పుడు ఎప్పుడు" అని అడిగారు అంట! తల ఎక్కడ పెట్టుకోవాలి తెలియక శ్రీ కేసీఆర్ గారు కూర్చుండి పోయారు అంట!

1 comments:

Anonymous said...

Paccha kamarlu vacchina vadiki lokam antha pacchaga kanabaduthundi..

Post a Comment