Sunday, September 13, 2009

అదన్నమాట! : సెప్టెంబర్ 6-12

1. "ఇక సెలవు" అని సాక్షి టీవీ గత పక్షం రోజులు గా రోజు మొత్తం వై ఎస్ ఆర్ మీద ఏదో ఒక కార్యక్రమం ప్రసారం చేస్తూనే ఉంది. సాక్షి టీవీ కి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే - ఇక చాలు.

ప్రత్యేకించి మొన్న శుక్రవారం రాత్రి మహిళా మంత్రులు అందరు సాక్షి స్టూడియో కి రావడం, వాళ్ళతో జరిగిన చర్చ కార్యక్రమం చూసాక సాక్షి టీవీ మీద విరక్తి వచ్చింది. చర్చను నిర్వహిస్తున్న వ్యక్తీ ఎప్పుడు ఎప్పుడు మంత్రులు కంట తడి పెడతారా అనట్టు చూడడం, ఎంత సేపు దిగ్బ్రాంతి కి లోను చేసే పదజాలం వాడడం, ఒక రకమైన విషాద ఛాయల్ని కార్యక్రమం లోకి బలవంతంగా తీసుకువచ్చే ప్రయత్నం చెయ్యడం అత్యంత శోచనీయం. సదరు పెద్ద మనిషి వై ఎస్ ఆర్ ని మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అని అడిగితె, "చూడు చిన్న, డాక్టర్ గా ఉంటె తక్కువ మందికి సహాయం చేస్తాను, రాజకేయాల్లో ఉంటె చాలా ఎక్కువ మందికి సహాయం చేస్తాను కదా, అందుకే వచ్చాను" అని చెప్పారు అంట. ఇది ఏదో పెద్ద కొత్త విషయం లాగ సెలవు ఇచ్చారు "చిన్నా" గారు. చూడు చిన్న, ఆయనఈ మాట ఇంతకు ముందు ఎన్ని సార్లు చెప్పారో లెక్కే లేదు. పై పెచ్చు, "చిన్నా" గారు మంత్రులు అందర్నీ "సబితమ్మ", "సునితమ్మ", అరుణమ్మ" అని సంభోదిస్తూనే ఉన్నారు. చిన్న గారు - ఇది మీ కుటుంబ కార్యక్రమం కాదు, వారు మీ కుటుంబ సభ్యులు కారు; రాష్ట్రానికి మంత్రులు. ముఖ్యమంత్రి పిలిచినట్టు గానే మీరు పిలిచిస్తే ఎలా అండి ? అసలు అటువంటి కార్యక్రమం ని నిర్వహించిన తీరు మీ వృతి కే కళంకం! ఈ ఒక్క ప్రోగ్రాం అనే కాదు, ప్రజలు ఎక్కడ మర్చిపోతారా, ఎక్కడ వాళ్ళ జీవితల్లు గాడిన పడిపోతాయా అన్న భయం తో సాక్షి టీవీ రోజు ఇలాంటి విషాద ఛాయలు ఉన్న ప్రోగ్రామ్స్ ప్రసారం చేస్తూనే ఉంది. మరణం తో బాధ ఉంటది, ఎవరు కాదనట్లేదు. అయితే ఆ బాధ ని తగ్గించే ప్రయత్నం శ్రేయోభిలాషులు చేస్తారు, పెంచే ప్రయత్నం చేసే వాళ్ళని ఏమి అంటారో నాకు తెలియదు మరి.

2. మొదట వీరప్ప మొఇలీ ని గారిని కలిసారు. ఆ తరువాత అహ్మద్ పటేల్ ని. తరువాత ప్రాణం ముఖేర్జీ ని. అప్పుడు సోనియా గాంధి ని. మరుసటి రోజు ప్రధానమంత్రి ని కలిసారు. ఆ తరువాత దిగ్విజయ్ సింగ్ ని కలిసారు. ఆ తరువాత అహ్మద్ పటేల్, వీరప్ప మొఇలీ ని ఒకే సారి కలిసారు. మరల ప్రణబ్ ని, సోనియా గాంధి ని ఒక సారి కలిసారు. ఆ తరువాత ఒక్క అహ్మద్ పటేల్ ని కలిసారు ... చదువుతుంటేనే మనకి అలసట వస్తుంది కదా, మరి కెవిపి గారి పరిస్థితి ఒక్క సారి ఆలోచించండి! ఎప్పటికి తరగని తెలుగు సీరియల్ లాగ సాగుతూనే ఉంది, జగన్ ఉదంతం!

3. కెవిపి గారు అక్కడ బిజీ బిజీ గా ఉంటె, ఇక్కడ కొత్త ముఖ్యమంత్రి రోశయ్య గారు కూడా బిజీ బిజీ గా గడుపుతున్నారు. రాజకీయంగా బలం లేకపోయినా సరే, పదవి లో ఉన్నంత కలం మంచి పని చెయ్యాలి అని ఆలోచనా లో ఉన్నట్టు ఉన్నారు, సమీక్ష సమావేశాల దగ్గర నుంచి కరువు ప్రకటనల వరకు అన్నిచేసుకుంటూ వస్తున్నారు. దీని బట్టి చూస్తూ ఉంటె, రాబోయే కొంత కలం వరకు ఆయనే ముఖ్యమంత్రి గా కొనసాగుతారు అనే అనిపిస్తుంది.

4. డిజిపి గారు మళ్ళి మన మీద చిందులు వేస్తునారు. పురుగులు పట్టి పోతారు అని మీడియా పైకి కొత్త శాపనార్ధాలు జల్లారు. ఎందుకు ఏమిటి అని అడగద్దు - అదంతే!