Sunday, September 20, 2009

అదన్నమాట!:సెప్టెంబర్ 13-19

1. రాష్ట్రం లో ఇంటర్మీడియట్ విద్య వ్యవస్థ లో సంస్కరణలు ప్రకటించారు. ఈ వార్త చూడగానే, హమయ్య, మొత్తానికి చేసారు అని అనుకున్నా. వార్త చదవగానే, సంస్కరణలు అంటే ఇవా అని చిరాకు వచ్చేసింది! అయుదేల్లలోనే ఇంటర్మీడియట్ పూర్తీ చెయ్యాలి అంట. పరీక్షలకు 24 పేజీలు ఉన్న షీట్ ఇస్తారు అంట, ఈ 24 పేజీలలోనే పరీక్ష మొత్తం రాసేయాలి అంట. పెద్ద పెద్ద సమాధానాలు రాస్తే మంచి మార్కులు వస్తాయి అని ఉహించె వారికి ఇది ఎదురు దెబ్బ అంట. మొదటి సంవత్సరం లో తీసుకున్న గ్రూప్ రెండో సంవత్సరం లో మార్చుకోవడానికి లేదు అంట. వీటిని సంస్కరణలు అని పిలవడం సిగ్గు చేటు. మార్పులు అని పిలిస్తే సరిపోతుంది. చదువు చెప్పే పద్దితి లో మార్పు తీసుకువస్తే, దాన్ని సంస్కరణలు అని పిలవండి. విద్యార్ధుల్ని ఆలోచింపజేసే విధంగా సిలబస్ మార్చండి, అప్పుడు సంస్కరణలు అని ఒప్పుకుంటాం. అంతే కాని, అడపా దడపా కొన్ని రూల్స్ ని మార్చేసి, ఏదో చేసేసాము అని ఆనంద పడితే సరిపోదు.

2. ఆంధ్రా యునివర్సిటి లో వై ఎస్ ఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు అంట. రోజు రోజుకి దిగజారుతున్న రాజకీయ నాటకానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. విశ్వవిధ్యాలయల్ని కూడా వదిలిపెట్టటం లేదు వీళ్ళు. రేపు పొద్దున్న మిగతా వాళ్లు కూడా మిగతా యూనివెర్సిటి లో విగ్రహాల్ని పెట్టమని డిమాండ్ చేస్తారు, మరి అప్పుడు?

3. దిగజారుడు రాజకీయాల గురుంచి ఎలాగో మాట్లాడుతున్నాము కాబట్టి, ఈ విషయం కూడా తెలియాలి మనకి. టైమ్స్ అఫ్ ఇండియా పత్రిక ఈ వారం ఒక సంచలన వార్త ప్రచురించింది. వై ఎస్ మరణాంతరం మీడియా లో వస్తున్నా సాధారణ ప్రజలు మరణాలు కొన్ని బోగస్ అని ఆ కథ సారాంసం. కొంత మంది నాయకులూ ఇలా చనిపోయిన వారి ఇంటికి వెళ్లి , మీ చావు వై ఎస్ మరణ వార్త విని అయ్యింది అని చెప్పమని డబ్బులు కూడా ఇచ్చారు అంట. అసలు ఒక నేత యొక్క జనామోదాన్ని తన మృత్యువు వల్ల ఎంత మంది చనిపోయారు అన్నా దాని మీద బేరీజు వేసే నీచమైన స్థితి కి మనం పడిపోయాం ఈ రోజున. సాక్షి టీవీ అయితే "వై ఎస్ కుటుంబం మీద ఎందుకు ఇంత కక్ష" అంటూ ఆ రోజు అంతా బ్యాండ్ వాయిస్తూనే ఉంది. జర్నలిజాన్ని కుడా ఎవరు పడిపోలేని లోటు కి అతి త్వరలో సాక్షి టీవీ మనల్ని తీసుకు వెళ్తుంది అని నా గట్టి నమ్మకం.

4. అమ్మాయిలు మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంటే, ఇంతకు ముందు కూడా జరిగేవి, కాని మీడియా సహకారం తో ఈ మధ్య కాలం లో ఇలాంటి వికృత చర్యలకి పాల్పడుతున్న వారి గురుంచి మనకి తెలుస్తున్నాయి. ఇలాంటి వాళ్ళని ఒక సారి ఎన్కౌంటర్ చేసిన సరే, ఇంక బుద్ధి రాలేదు. అసలు కంప్లైంట్ రాగానే చితకబాదితే అప్పుడు కాని ఇవి తగ్గవు ఏమో.

5. డిజిపి ని మారుస్తారు, మారుస్తారు అని తెగ వార్తలు వచ్చాయి. ఎప్పుడు ఎప్పుడ అని చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి!