Sunday, September 27, 2009

అదన్నమాట! : సెప్టెంబర్ 20-26

1. "సీమ సందుల్లో పందుల్లా కొట్టుకుందాం" అనే ఒక కామెడి డైలాగ్ గుర్తు వచ్చింది ఈ వారం తెరాసా వాళ్ళు కొట్టుకుంటున్న తీరు చుస్తే! అంటే తెరాస వాళ్ళు సీమ లోకి వెళ్ళరు అనుకోండి ;-) ! ఇంతకి ఏమి జరిగింది అంటే, ఒక ఎమెల్యే తిరుగుబాటు చేసారు. కెసిఆర్ ని తిట్టారు. యదా ప్రకారంగానే అయినను పార్టి నుంచి బహిష్కరించాలి అని నిర్ణయం తీసుకునారు. దాని తో సరిపెట్టుకోకుండా, మంచీర్యాల లో "ప్రజా కోర్ట్" అనే సమావేశాన్ని పెట్టి, అక్కడ కూడా ప్రజలు ముందే సదరు ఎమెల్యే ని బహిష్కరించాలి అని అనుకున్నారు. సదరు ఎమెల్యే ఎందుకు ఊరుకుంటాడు అండి? తన అనుచర్లన్ని కూడా భారి గా తీసుకువస్తాను, మీరో నేనో తేల్చుకుందాం అని సవాల్ విసిరాడు. ముందు రోజు చాలా ఇబ్బందికర పరిస్తితులు తలెత్తడం తో, పోలీసులు "ప్రజా కోర్ట్" కి అనుమతి ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఏమో మళ్ళి కనిపించకుండా పోయారు! మద్యం మత్తు లో ఉండే అయన నన్ను ఏమి చేస్తారు అన్నట్టు సదరు ఎమెల్యే ధైర్యం తో ఉన్నారు! అసలు ఇది అంత ఒక వీధి తగాదా కన్నా దారుణం గా ఉంది. వీళు నాయకులూ అంట, మనల్లని ఉద్దరిస్తారు అంట!

2. వీళ్ళ బాధ ఇలా ఉంటె, ప్రజా రాజ్యం పార్టి వాళ్ళది ఇంకో బాధ. చిరంజీవి గారి మెతక వైఖరిని కొంత మంది ఎమెల్యేలు దుర్వినియోగం చేస్తున్నారు అంట! జగన్మోహన్ రెడ్డి పావురాల గుట్ట సందర్శించినప్పుడు అయన తో పాటు శోభ నాగిరెడ్డి, భూమ నాగిరెడ్డి, మరియు ఇంకో ఎమెల్యే కూడా వెళ్ళారు. వెళ్ళడమే కాకుండా, అక్కడ జరగిన సంతాప సభ లో కూడా పాల్గున్నారు. అయిన చిరంజీవి గారికి ఏమి అనుమానం రాలేదు అంట లే, పార్టి లోని "సేనిఎర్స్" కి మాత్రం ఇది నచ్చలేదు అంట! చిరంజీవి గారికి చెప్తే, ఒకటి రెండు రోజుల్లో కమిటీ మీటింగ్ పెట్టి నిర్ణయిద్దాం అని చెప్పారు. సొంత గా నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు చిరంజీవి గారు?

3. ఇక దిగజారలేదు లే అని అనుకుంటున్నా తరుణం లో సాక్షి టీవీ ఇంకో ఆణిముత్యం మనకి చూపించింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క నిమషం పాటు సాగే చిన్న సినిమా ఒకటి రిలీజ్ చేసింది! పెద్ద పెద్ద పదాలు వాడేసి, రాజీవ్ గాంధీ తో పోల్చేసి, అసలు జగన్ అంత గొప్ప మనిషి ఈ రాష్ట్రం లోనే లేదు అని మనకు సెలవు ఇవ్వడం జరిగింది! అదే రాజీవ్ గాంధి 1989 లో ఎంత దారుణంగా ఓడిపోయారో మన అందరికి తెలిసిన విషయమే. ఆవేశాలకి పోయి ఆయనను ప్రధానమంత్రి ని చేసారు. తరువాత ఇరువై ఏళ్ళు పట్టింది ఆ వైభవం తిరిగి రావడానికి పార్టి కి. ఇప్పుడు అదే ఆవేశం తో జగన్ ని ముఖ్యమంత్రి చేస్తే, ఏమి అవుతుందో అని అధిష్టానం ఆలోచనా. ఇందులో తప్పు ఏమి ఉంది అండి? వై ఎస్ ఆర్ ఎంత కష్టపడితే ముఖ్యమంత్రి స్థాయి కి ఎదిగారో, అందులో ఒకటో వంతు కూడా కష్టపడకుండా ముఖ్యమంత్రి అయ్యిపోదాం అంటే ఎలా?

4. డిజిపి గారు ఇంకా పదవి లోనే ఉన్నారు. పై పెచ్చు నిన్ననే ఈయన గారు వెళ్లి హొంమంత్రి ని మరియు కెవిపి గారిని కలిసి తిరుపతి ప్రసాదం ఇచ్చారు అంట! కెవిపి గారిని కలవడం ఎందుకు అండి ? అసలు ఆయనకు ఉన్న హొదా ఏమిటి? ఒక వేల ప్రజా భద్రతా కమిటి చైర్మన్ హోదా లో కలిస్తే, మరి అసలు ఆ కమిటి ఇన్నాలు సమావేశం ఎందుకు కాలేదు? అసలు రాష్ట్ర చరిత్ర లో ఒక ఆఫీసర్ మీద విపక్షం, స్వపక్షం రెండు ఒకటే అభిప్రాయం తో ఉండడం అనేది జరిగి ఉండదు. ఆయినా ఇంకా పదవి లో ఉన్నాడు అంటే, అసలు ఎం జరుగుతుంది?

4 comments:

Arun said...

This is the main front page article on New York Times today:

Indian and Pakistani dossiers on the Mumbai investigations, copies of which were obtained by The New York Times, offer a detailed picture of the operations of a Lashkar network that spans Pakistan.

http://www.nytimes.com/2009/09/30/world/asia/30mumbai.html?hp

shiv shankar said...


for more information about packers and movers of gurgaon click on the one of the following link:
packers and movers in gurgaon
movers and packers in gurgaon
packers and movers gurgaon
movers and packers gurgaon
http://www.top8list.in/packers-movers-gurgaon/

shiv shankar said...

for more information about packers and movers of noida click on the one of the following link:
packers and movers in noida
movers and packers in noida
packers and movers noida
movers and packers noida
http://www.top8list.in/packers-movers-noida/

Badal Rain said...


movers and packers noida
packers and movers in gurgaon
packers and movers in bangalore
packers and movers noida
packers and movers gurgaon

Post a Comment