Sunday, July 11, 2010

అదన్నమాట! : జూలై 4-10

" ఈ యాత్ర ని ఒక దండ యాత్ర లాగ కాకుండా, ఓదార్పు యాత్ర లాగ జరపమనే అధిష్టానం ఆలోచన" అని ముఖ్యమంత్రి రోశయ్య గారు డిల్లి లో చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం దండ యాత్ర లాగే చేస్తున్నారు, అధిష్టానం మాట కి విలువ ఇవ్వకుండా !! రాష్ట్ర రాజకీయాల్లో అధిష్టానాన్ని ఎవరైనా ఎదురిస్తారు అని ఉహించి ఉండరు ! జగన్ గారు ఓదార్పు పేరు తో, జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, గత తొమ్మిది నెలల లో రాజకీయాలు బాగా బ్రష్టుపట్టిపోయాయి అని సెలవు ఇచ్చారు. వినే వాళ్ళు ఉంటె, ఏమైనా చెప్తారు కదా ఈ నాయకులు! మరుసటి రోజు విమర్శలు పదను ఎక్కాయి. వై ఎస్ ఆర్ పుట్టినరోజు నాడు ఎంఎల్యే లను జిల్లాలకి వేల్లనివ్వలేదు అని విమర్శించారు. తనతో పాటు ఓదార్చడానికి ఎవ్వరిని వెళ్ళకూడదు అని ఆదేసిన్చినందుకు, "నేను ఎం పాపం చేశాను " అని ఎదురు ప్రశ్నించారు. చనిపోయిన వారు కాంగ్రెస్స్ కార్యకర్తలు కార అని గట్టిగా అడిగారు. ఇంత చేసిన, ఇంకా తిరిగుబాటు చేస్తునారు అని మాత్రం చెప్పలేదు. చిరంజీవి గారి మద్దత్తు ప్రభుత్వం కి ఉన్నంత వరకు, ఈయన తిరుగుబాటు చెయ్యాలి అంటే కనీసం 30 ఎమ్యెల్యేలు కావలి... అంత వరకు ఈ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. రాష్ట్రం లో పరిపాలన మాత్రం జరగటం లేదు , దాని గురుంచి మాత్రం ఎవ్వరు చర్చిన్టటం లేదు.

0 comments:

Post a Comment