Sunday, July 25, 2010

అదన్నమాట! : జూలై 18-24

చంద్ర "బాబ్లి" నాయుడు . ఈ వారం చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర లో సృష్టించిన ప్రకంపనాలకు ఆయనకీ ఈ విధం గా పేరు పెట్టారు ! బాబ్లి లో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ అక్రమమైనదని రాష్ట్రం లో అన్ని పార్టీలు ఎప్పటి నుంచో మొర పెట్టుకుంటున్నాయి. బాబ్లి ప్రాజెక్ట్ ని సందర్శించడానికి నాయుడు గారు 76 మంది ప్రజా ప్రతినిదులున్ని వెంట బెట్టుకుని వెళ్ళారు. అయితే మహారాష్ట్ర పోలీసులు ప్రాజెక్ట్ చూపిస్తాము అని చెప్పి, వీళ్ళని అర్రెస్ట్ చేసారు. అందరిని ఒక హాస్టల్ లో పెట్టారు. బెయిల్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోతారు అని అందరు అనుకున్నారు. ఇక్కడే నాయుడు గారు కొత్త వ్యూహం పన్నారు. ఎం తప్పు చేసాము అని బెయిల్ తీసుకోవాలి అని ప్రశ్నించారు. బబ్లి చూసే వరకు వెళ్ళేది లేదు అని అందరు అక్కడే ఉంది పోయారు. కోర్ట్ చెప్పిన వినలేదు, అక్కడే ఉన్నారు. రాత్రి పూట రెండు చిన్న వ్యాన్స్ తీసుకు వచ్చి వేరే జైలు కి తరలిస్తున్నాము అని చెప్పారు. నాయుడు గారు కోపగించు కోవడం తో వెనక్కి తగ్గారు. మరుసటి రోజు ఆరంగాబాద్ జైలు కి పంపిస్తునాము అని చెప్పారు. తీరా చూస్తే విమానాశ్రయం కి తీసుకువెళ్ళి అక్కడే ఒక ప్రత్యెక విమానం లోకి బలవంతంగా ఎక్కించి వెనక్కి పంపేసారు.

ఈ 4 రోజుల పాటు జరిగిన ఉద్దంతాన్ని మన టీవీ చానల్స్ ఎద తెరిపి లేకుండా చూపించాయి. మన ప్రజా ప్రతినిదులకి జరిగిన అవమానాన్ని చూసి ప్రజలు కూడా ఖండించారు. ప్రాజెక్ట్ చూపిస్తాము అని చెప్పి అర్రెస్ట్ చెయ్యడం, అర్రెస్ట్ చేసిన తరువాత సరైన సౌకర్యాలు కలిపించక పోవడం , ప్రజా ప్రతినిధుల్ని లాతిలతో కొట్టడం - ఇవ్వన్ని చూసి ప్రజలు కూడా నిర్ఘాత పోయారు. అన్ని పార్టీలు కుడా తీవ్రంగా ఖండించాయి.

ఇది ఇలా ఉండగా - సాక్షి టీవీ మాత్రం జగనన్న ఓదార్పు యాత్ర కి ఎద తెరిపి లేని కవరేజి ఇస్తూనే ఉంది ... అదీ అలా సా .... గుతూనే ఉంది ! అదన్నమాట!

0 comments:

Post a Comment