Sunday, July 4, 2010

అదన్నమాట! : జూన్ 27- జూలై 3

"తెలంగాణా కి అడ్డొస్తే , అడ్డంగా నరికేద్దాం." విజయశాంతి గారు ఇలా చెప్పారు. ఎన్నికల కమిషన్ ఈ వ్యాఖ్య ని చాలా సీరియస్ గా తీసుకుంది. విజయశాంతి మీద కేస్ పెట్టమని ప్రభుత్వం కి ఆదేశాలు ఇచ్చింది. అర్రెస్ట్ చెయ్యడానికి పోలీసులు వెళ్తే, కార్యకర్తలు ఎక్కడలేని హడావాడి సృష్టించారు. ఏదో ఏదో గొడవ చేసారు. మహిళా ఎంపీ ని ఎలా అర్రెస్ట్ చేస్తారు అని వక్రీకరించారు కూడా ! అంటే, మహిళ ఎంపీ నోటికి వచ్చినట్టు వాగోచ్చ ? మొత్తానికి ఆ రోజు అర్రెస్ట్ చెయ్యలేకపోయారు. మరుసటి రోజు విజయశాంతి గారు మెదక్ బయల్దేరి వెళ్ళరు. ఆవిడ వాహనాన్ని ఆపి పోలీసులు అర్రెస్ట్ చేసారు. మళ్ళి హడావడి సృష్టించారు విజయశాంతి గారు. నడి రోడ్ మీద ఎలా అర్రెస్ట్ చేస్తారు అని చిందులు వేసారు. మీరు ఇంట్లో ఉండకుండా రోడ్ ఎక్కితే , ఇంకా ఎక్కడ అర్రెస్ట్ చేస్తారు విజయశాంతి గారు?? చేసింది ఒక చెత్త వ్యాఖ్య, మళ్ళి దానిని సమర్ధించుకోవడం ఒకటి !

ప్రముఖ నక్సలైట్ నాయకుడు చెరుకూరి రాజ్కుమార్ అలియాస్ ఆజాద్ ని పోలీసులు ఈ వారం ఎన్కౌంటర్ లో చంపేశారు. మాధవ రెడ్డి మీద జరిగిన దాడి, శ్రీపాద రావు మీద జరిగిన దాడి, చంద్రబాబు నాయుడు మీద జరిగిన దాడి, నేదురమల్లి మీద జరిగిన దాడి, ఉమేష్ చంద్ర, వ్యాస్ మీద జరిగిన దాడి - ఇవ్వన్నితి వెనకాల ఆజాద్ హస్తం ఉంది. ఆజాద్ మరణం తో నక్సల్స్ కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పోలీసులకి ఇది ఉత్శాహాన్ని ఇచ్చింది.

1 comments:

Anonymous said...

Chatt..chatt...chatt..

Post a Comment