గౌరవనీయులైన ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి,
పేదల కోసం మీరు పడుతున్న తపన చూసి మాకు కళ్ళు చేమ్మగిల్లుతున్నాయి. ఈ మధ్య మీరు వాళ్ళు బియ్యం కోసం పెట్టె కర్చుని ఏకంగా 50% తగ్గించి వాళ్ళకి చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేము ఏమో. కిలో కి రెండు రూపాయలు చేల్లించుకోలేని పరిస్థితి లో దాదాపు రాష్ట్రం లోని 2 కోట్ల కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే, అదీ మీరు చూడలేక, చూసినా భరించలేక, వెంటనే స్పందించి - ఇంక రెండు రూపాయలు కుడా కర్చుపెట్టద్దు , నేను మీకు అదీ 50% తగ్గిస్తాను; ఇక మీదట కేవలం ఒక్క రూపాయి మాత్రమె ఇవ్వండి, కిలో బియ్యం తీసుకు వెళ్ళండి అని ప్రకటించేశారు. అంతే కాకుండా, ఇంకో 25 లక్షల తెల్ల రేషన్ కార్డ్లు కూడా ఇచ్చేస్తాము , పండగ చేసుకోండి అని సెలవు ఇచ్చారు ! 2.25 కోట్ల రేషన్ కార్డ్లకి మీరు కిలో రూపాయి కి బియ్యం ఇస్తున్నారు. అంటే దాదాపు 8 కోట్ల ప్రజలకి ఈ పధకం వర్తిస్తుంది. మిగిలిన 50 లక్షలు మంది ఎం పాపం చేసారు సార్ - వాళ్ళకి కూడా ఇచ్చేయండి కిలో రూపాయి కి. మర్చిపోయా - మిగిలిన వాళ్ళ దగ్గర పన్ను రూపేణా డబ్బు లాగుకుని, ఈ పధకం కోసం అయ్యే కేవలం 600 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మొయ్యాలి కదా ... అసలు సార్ మీది బుర్రే బుర్ర ! కానివ్వండి ... ఇలానే కానివ్వండి !
సార్ - మీలో ఇంకో గొప్ప లక్షణం ఉంది అంట కద? ఏ పరిస్థితి ని ఆయినా భలే అర్ధం చేసుకుంటారు అంట కద ? ఈ మధ్యనే మాకు కూడా అర్ధం అయ్యింది. అక్కడ అక్కడ అల్లరి చిల్లర గా తెలంగాణా లో జరుగుతున్న ఈ సకల జనుల సమ్మె వల్ల సామాన్య ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది అని మీరు సెలవు ఇచ్చారు చుడండి.... సార్, అసలు మీది బుర్రే బుర్ర ! కేవలం 14 రోజుల నుంచి సమ్మె జరుగుతున్నా సరే, మీరు ఇంత అద్భుతం గా భలే ఆలోచించారు సార్. సరదాగా రోజుకి రెండు నుంచి ఆరు గంటల విద్యుత్ కొత్త అంట కదా ? బస్సులు నడవటం లేదు అంట కద? విద్యా సంస్థలు మూసివేసారు అంట కద? మధ్యలో ఆటోలు, రైళ్ళు కూడా రెండు రోజులు నడవలేదు అంట కద ?. కేవలం ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందలుకే మీరు సామాన్యుడు గురుంచి అంత లాగ ఆలోచించారు అంటే .... నీళ్ళు , కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి సార్.
రెండు నెలలు నుంచి సమ్మె చేస్తాం అని మీకు చెప్పినా, అసలు మీరు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు సమ్మె జరుగుతున్న మీరు పెద్దగా పట్టించుకోవటం లేదు. అసలు నాయకులకి ఉండాల్సిన లక్ష్యం ఇదే సార్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్దగా పట్టించుకోకపోవడం. మొన్న ఆ మధ్య మీ మంత్రి వర్గం లోని 12 మంది రాజీనామా చేసి పని చెయ్యలేదు అంట కద ? హొం మంత్రి కూడా రాజీనామా చేసారు అంట కద? అసలు అంత మంది పని చెయ్యక పోయిన, ఆ బాధ్యత ని కూడా మీరు మీ భుజాల మీద వేసుకున్నారు అంట కద ? ఆఫీస్ కి రావద్దు లే, ఇంటి నుంచే ఫైల్స్ క్లీయర్ చేసిన పర్వాలేదు అని వాళ్ళకి మీరు ఇచ్చిన ప్రోత్సాహం - అసలు సార్, మీదే బుర్రే బుర్ర !
మీ మంత్రి వర్గం లోని ఇంకో మంత్రి, శ్రీమాన్ శంకర్ రావు గారు రోజుకి ఒక సారి మిమ్మల్ని కాని, తోటి మంత్రులను కాని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఒక మంత్రి మిగతా మంత్రుల మీద విచ్చల విడి గా అక్రమార్జన ఆరోపణలు చేస్తున్నారు. ఒక మంత్రి గా, కనీసం మనిషి గా పాటించాల్సిన హుందా ఏ మూల ఉండదు ఆయనికి. ఆయినా సరే, మీరు పెద్దగా పట్టించుకోరు చుడండి - అదీ సార్ మీలో గొప్పతనం!
ప్రబుత్వ ఉద్యోగులు పని చెయ్యకపోయినా, మంత్రులు పని చెయ్యక పోయినా, బస్సులు , ఆటోలు, రైళ్ళు లాంటివి నడవకపోయినా, బొగ్గు ఉత్పత్తి దెబ్బ తిన్నా - మీరు చిరంజీవి గారితో కలిసి విశాఖపట్నం లో బహిరంగ సభకి వెళ్లి, అక్కడ ఏమో మీ పార్టి ఈ సారి లోక్ సభ కి రాష్ట్రం లో ఉన్న మొత్తం 42 సీట్లు గెలిచిపోతుంది అని ధీమా వ్యక్తం చేసారు. మీలో ఉన్న ఈ నమ్మకానికి అందుకోండి మా జోహార్లు. రాష్ట్రం ఇంత క్లిష్ట పరిస్థితి లో ఉంటె, మీరు మీ బిజీ స్కెడ్యూల్ లోంచి కొంచం సమయం, "సకల జనుల సమ్మె విరమించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు" అని విన్నవిస్తున్నారు చుడండి సార్.... అదీ సార్ మీలో ఉన్న గోప్పతన్నం. ముఖ్యమంత్రి గా సమస్య ని పరిష్కరించాల్సింది పోయి, కేవలం ప్రకటనలు ఇస్తున్నారు అంటే, అసలు మీలో ఒక అదీ, ఒక ఇది ... అబ్బబ్బబ్బా అసలు మాటలు రావటం లేదు అండి !
రాష్ట్రం లో రైతులు పంట విరామం ప్రకటించారు అంట కదా ? ఎరువుల ధరలే కారణం అంట కదా? అసలు పంట పండిచకపోవడం ఎంటండి ? అసలు ఈ చిన్న ఆపద మీ అభిప్రాయం వినే భాగ్యం మాకు ఇంకా కలగలేదు. వ్యవసాయ మంత్రి (అయన ఉప ముఖ్య మంత్రి కూడా ) గారు కూడా వారి స్పందన ఏమి చెప్పినట్టు లేరు మరి.
కిలో రూపాయి బియ్యం పధకం కోసం సోనియా గాంధి గారి అనుమతి తీసుకున్నారు అంట కద ? మీరే చెప్పారు లెండి - ఈ అద్భుతమైన పధకం కి సోనియా గారికి మనం కృతఙ్ఞతలు చెప్పాలి అని , అందుకే అడుగుతున్నా ! మరి తెలంగాణా సమస్య వల్ల అక్కడ అక్కడ ఇబ్బంది పడే కొంత మంది సామాన్యులు కూడా సోనియా గాంధి నే ప్రశ్నించాలా ? అమ్మో వద్దు లెండి, ఆమెని ఏమైనా అంటే మీరు మీ పార్టీ వాళ్ళు ఊరుకోరు ... ఎందుకు వచ్చిన గొడవ లెండి.
ఈ సమ్మెలు , బంద్లు , పుకార్లు, గొడవలు అన్ని పట్టించుకోవద్దు సార్. మీ లక్ష్యం వైపు ముందుకు దూసుకు వెళ్ళండి. ఇప్పటికే మీ ప్రభుత్వం రాష్ట్రం లో 8 కోట్ల మందిని పేద వాళ్ళను చేసింది. ఈ సంఖ్యా పెరగాలి అని మీరు పడుతున్న తపన, దాని కోసం పడుతున్న శ్రమ - ఈ రెండిటిని ఏ శక్తి ఆపలేవు. మీ పాలన లో మరింత మంది పేదలు పెరగాలి అని ఆకాంక్షిస్తూ ....
భవదీయుడు,
సుధీర్ కుమార్
2 comments:
Haha.. ultimate.. We are living in the times of weakest prime minister and similar competent chief minister.
మరి తెలంగాణా సమస్య వల్ల అక్కడ అక్కడ ఇబ్బంది పడే కొంత మంది సామాన్యులు కూడా సోనియా గాంధి నే ప్రశ్నించాలా ? అమ్మో వద్దు లెండి, ఆమెని ఏమైనా అంటే మీరు మీ పార్టీ వాళ్ళు ఊరుకోరు ... ఎందుకు వచ్చిన గొడవ లెండి.
Hello Mr. Sudhir,
How dare you to name our amma garu in here?
This is enough to us file a cbi case against you, be ready for it.
Regards
Amma gari bhajana parudu (nenu a peru cheppina meeru ilage brand vestarani naku telusu)
Post a Comment