Sunday, September 4, 2011

అదన్నమాట! : ఆగస్ట్ 31 - సెప్టెంబర్ 3



రాష్ట్రం లో రాజకీయ అనిశ్చితి కొనసా ...గుతూనే ఉంది. రోజూ సిబిఐ విచారణ జరుగు ..తూనే ఉంది.


ఇది అంతా జగనన్న వర్గానికి చెందినా ఎంఎల్ఏలను నిరాస పరచడానికే అని అనిపిస్తుంది. విచారణ ఎంత పొడిగిస్తే, అంత ఎక్కువ సమయం వీలన్ని బుజ్జగించడానికి / బెదిరించడానికి కాంగ్రెస్స్ వాళ్ళకి దొరుకుతుంది. జగన్ ని అర్రెస్ట్ చేస్తారు అని ఊహాగానాలు పుట్టిస్తున్నారు. కాదు, కేవలం ఆస్తుల్ని జప్తు చేస్తారు అని ఇంకో ఊహాగానం పుట్టిస్తున్నారు. మరి ఇలా అయితే, మీ పరిస్థితి ఏంటి అని ఎంఎల్ఏలను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పీకర్ గారు కూడా రోజుకి ఇద్దరు ఎంఎల్ఏలను మాత్రమె కలుస్తున్నారు. మరి బుజ్జగిస్తున్నారో, వాళ్ళ మాటలు వింటున్నారో ఎవరికీ తెలిదు. ఇది ఇలా ఉండగా, జగనన్న ఇవ్వాళ తన వర్గపు ఎంఎల్ఏలను కలుస్తున్నారు. ఇప్పటి వరకు రాజీనామా చేసిన 26 మంది కాకుండా, ఇంకా మరి కొంత మంది చేత రాజీనామాలు చేయించాలి అని జగనన్న అలోచిస్తునట్లు ఇంకో పుకారు పుట్టింది. మొత్తం కలిపితే, రాష్ట్రం లో రాజకీయ అనిశ్చితి ఇప్పుడు అప్పుడే అంతం అయ్యేది లాగ లేదు.


ఇది ఇలా ఉండగా, తెలంగాణా ఉద్యోగులు ఈ నెల 13 నుంచి సమ్మె చేస్తారు అంట. అట్టేందర్ దగ్గర నుంచి గజేట్టేడ్ ఆఫీసర్ దాక అందరు పని మానేస్తారు అంట. అంటే, మళ్ళి ఇంకో అనిశ్చితి కి తెర లేగావనుంది. అదన్నమాట!








0 comments:

Post a Comment