మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. తెలుగు లో రాసే ఆర్టికల్స్ కి వచ్చిన అంతరాయానికి చింతిస్తున్నా :( . అనివార్య కారణాలు వల్ల రాయలేకపోయాను. గత నెల లో చాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ముఖ్యమైన పరిణామం - జగనన్న మీద సిబిఐ విచారణ !
మాకు ఏమి సంబంధం లేదు, అంతా కోర్ట్ ఆదేశాల మేరకు జరుగుతున్నాయి అని కాంగ్రెస్స్ వాళ్ళు కబుర్లు చెప్తున్నారు. కోర్ట్ లో కాసు వేసింది కాంగ్రెస్ మంత్రి అని మాత్రం చెప్పారు!! ఎప్పుడో జరగాల్సిన విచారణ ఎట్టకేలకు మొదలు అయ్యింది. కాని, జగన్ మరియు యైఎసార్ కాంగ్రెస్స్ లో ఉన్నంత కాలం, ఈ అవినీతి, అక్రమ సంపాదన గుర్తు రాలేదా?? జగన్ అంత దోచుకుంటే, దాంట్లో అసలు వైఎసార్ ప్రమేయం లేదు అంటే నమ్మడానికి జనం ఏమైనా పిచ్చోల్లా ?
జగన్ అవినీతి పరుడు అని ఇప్పుడు కాంగ్రెస్స్ వాళ్ళు కూడా కోడై కూస్తున్నారు ? ఇప్పుడు గుర్తు వచ్చిందా మీకు ? అప్పుడు ఏమో మీరు ఆటను కలిపి దోచుకునప్పుడు ప్రశ్నిస్తే, కొట్టి పారేశారు కదా ఆరోపణలు అన్ని? కాంగ్రెస్స్ నుంచి బయటకి రాగానే, ఈయన అవినీతి పరుడు, అక్రమంగా డబ్బులు సంపాదించాడా ? జగనన్న మీద వేసిన చార్గిశీట్ లో వైఎసార్ పేరు కూడా ఉంది అంట ... ఈ మాట విని 26 మంది ఎమ్యెల్యేలు రాజీనామా చేసారు. ముందు ఏమో వాళ్ళని బుజ్జగించడానికి ప్రయత్నించారు. వాళ్ళు వినకపోవడం తో, ఇప్పుడు ఏమో రాజీనామాలు ఆమోదించ మంటున్నారు. మళ్ళి ఎన్నికలు వస్తాయి, పాలన స్తంబిస్తుంది.
క్రిందటి నెల ఏమో తెలంగాణా ఎమ్యెల్యేలు, మంత్రులు రాజీనామా డ్రామా నడిచింది. మంత్రులు ఏమో ఆఫీస్ కి వెళ్ళడం మానేసారు, ఒక నెల వరకు ! కేంద్ర ప్రభుత్వం, 14(f) ని తీసేసింది అన్న మంత్రులు పని లోకి రావడం మొదలు పెట్టారు. ఇలా పని లోకి వచ్చారో లేదో, జగనన్న ఎమ్యెల్యేలు రాజీనామా ఇచ్చారు. ఇంకా పాలించే సమయం ఎక్కడికి అండి? రాష్ట్రం ఇంత లాగ అతలాకుతలం అవుతూ ఉంటె, పట్టించుకునే నాధుడే లేదు మనకి !
ఇంత హడావడి మధ్యలో , చిరంజీవి గారు రాహుల్ గాంధి సమక్షం లో కాంగ్రెస్స్ లో చేరిపోయారు. మనసులు కలుపుకోవాలి అని కార్యకర్తల్ని ఉద్దేశించి చెప్పారు కూడా. మిగిలిన ఆ కొద్ది పాటి కార్యకర్తులు అయన మాట వినక ఎం చేస్తారు లెండి !
ఈ నెల రోజుల్లో జరిగిన ఏకైక మంచి - మంచి వర్షాలు పడ్డాయి రాష్ట్రం లో. అదన్నమాట!
0 comments:
Post a Comment