తెలంగాణా ఉప ఎన్నికల ఫలితాలు అందరిని ఆశ్చర్య పరిచాయి. తెరాసా 11 స్థానాల్లో విజయ ఢంకా మ్రోగించగా, భారిత్య జనత పార్టి తన నిజామాబాద్ స్థానాన్ని మళ్ళి దక్కించుకుంది. 2009 లో కన్నా తెరాసా అభ్యర్దులకి చాలా ఎక్కువ మెజారిటి వచ్చింది. అందరు ఆశ్చర్య పోయిన విషయం ఇంకోటి ఏంటి అంటే, తెలుగు దేశం పార్టి అన్ని స్థానాల్లో తన డిపాసిట్లు కోల్పోయింది. కాంగ్రెస్స్ రాష్ట్ర అద్యక్షుడు శ్రీ డి శ్రీనివాస్ మళ్ళి ఓడిపోయారు. తెలంగాణా వాదానికి ఈ ఫలితాలు చాలా బలాన్ని చేకూర్చాయి. ఇంత పెద్ద స్థాయి లో మెజారిటి రావడం తెరాస శ్రేణుల్లో మళ్ళి ఉత్సహాన్ని నింపింది. తెదేపా మరియు కాంగ్రెస్స్ పార్టీలు ఆత్మా రక్షణ లో పడ్డాయి. ఈ లోపల, ఉస్మానియా ఉనివర్సితి లో ఒక ఇంజినీరింగ్ విద్యార్ధి డి శ్రీనివాస్ ఓడిపోయాడు అన్న ఆనందం లో ఆత్మా హత్య చేసుకున్నాడు! ఏంటో ఇది, తెలంగాణా వచ్చినా రాకపోయినా ఈ ఆత్మా హత్యలు ఆగేటట్టు లేదు.! ఇక ఇప్పుడు శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
0 comments:
Post a Comment