Sunday, June 13, 2010

అదన్నమాట!: జూన్ 6-12

1 . జీ టీవీ లో "ఆట" అని ఒక ప్రోగ్రాం వస్తుంది. పిల్లల డాన్సు షో అదీ. డాన్స్ వరకు చేస్తే బానే ఉంటది. కాని ఆ షో కేవలం డాన్స్ కి పరిమితం కాదు. "మార్గాదర్సకులు" అని చెప్పుకునే ముగ్గురు , వాళ్ళ మధ్య కొట్టుకోవడం తో పాటు, అప్పుడు అప్పుడు పిల్లల్ని కూడా లాగుతారు. అదీ కిందటి ఏడాది. ఈ ఏడాది ఇంకో మెట్టు ఎక్కారు. ఈ ముగ్గురు "మార్గాదర్సాకులకి" ఇంకోడు చేరాడు. వీళ్ళ పక్కకి ఇద్దరు పిల్లలు ఉంటారు. వాలు కూడా మార్గాదర్సాకులే అంట ! అంటే, చిన్న పిల్లలే చిన్న పిల్లలకి మార్గాదర్సకులు. వాళ్ళని హేళన చేస్తారు, పొగడ్తలతో ముంచేతుతారు. ఇంకా డాన్స్ సంగతి సరే సరి. అసభ్యత ని పక్కన పెట్టండి, ఆ శరీరాల మీద పడే స్ట్రెస్ అంటా ఇంతా కాదు. కాంపటిషన్ పేరు తో "ఆట" చేస్తున్న వ్యాపారం మీద, ఎట్టకేలకు రాష్ట్ర మనవ హక్కుల సంఘం నిషేధం విధించింది .

2 . రాష్ట్ర ప్రభుత్వం ఈ వారం మద్యం దుకాణాల కి వేలం పాటు వేసింది. ఏడు వేల కోట్ల రూపాయలు. ఈ వేలం పాటు నుంచి ప్రభుత్వ ఖజానా లోకి వచ్చి పడ్డాయి. తెదేపా నాయకుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు, "తాగండి, ఊగండి " అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం గా ఉన్నట్టు ఉండి ! ఈ వేల పాటు లో అనేక మంది రాజకీయ నాయకులు బాగా డబ్బులు పెట్టినట్టు కూడా మీడియా లో అంటున్నారు.

3 . చంద్రబాబు నాయుడు గారు ప్రజా రాజ్యం పార్టి ని దుమ్మెతి పోశారు. కొన్నాలు ఆగితే, ప్రరప కాంగ్రెస్స్ లో విలీనం అవుతుంది అని తేల్చి చెప్పారు. దీనికి చిరంజీవి గారు బాగా ఫీల్ అయ్యి ఒక లేఖ రాసారు. చంద్రబాబు గారు సమాధానం ఇవ్వలేదు కాని, హరికృష్ణ గారు రాసారు. వీరిద్దరూ ఏమి రాసుకున్నారో, చర్చించాల్సిన అవసరం అస్సలు లేదు.. కాని ఈ లేఖల యుద్ధం వాళ్ళ రాష్ట్ర ప్రజలకు కొంచం ఊరట వస్తుంది !

0 comments:

Post a Comment