Sunday, June 27, 2010

అదన్నమాట! : జూన్ 20-26

ఈ వారం పెద్దగా చర్చించే విషయాలు ఏమి జరగలేదు. ఉప ఎన్నికల వేడి ఇప్పుడు ఇప్పుడే పుంజుకుంటుంది. ప్రజా రాజ్యం మరియు లోక్ సత్తా పార్టీలు ఈ ఉప ఎన్నికలలో పోటి చెయ్యటం లేదు అని చెప్పారు.

బీసీ విద్యార్ధులకి ఫీజు చెల్లింపులు జరగటం లేదు అని ఎవరో బీసీ నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నారు. రోశయ్య గారు కుండ బద్దల కొట్టి మరి సవాల్ విసిరారు... ఒక్క అర్హుడైన విద్యార్ధి కూడా ఇప్పటి వరకు ఫిర్యాదు ఏమి చెయ్యలేదు... ఇది కేవలం యాజమాన్యాల కుట్ర అని. దాదాపు ఆరు లక్షల మంది కి సహాయం అందలేదు అని మంత్రులు వివరించారు. కారణం - సరిగ్గా బ్యాంక్ ఖాతాలు తెరవకపోవడమే !

కేంద్ర ప్రభుత్వం ఈ వారం లో పెట్రోల్, డీసిల్, గ్యాస్ సిలండర్ల ధరలు పెంచింది. ఈ భారం వాళ్ళ మిగతా నిత్యావసర ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. అవకాశం ఉండడం ఏంటి, మరింత పెరుగుతాయి కూడా ఖచ్చితం గా !

0 comments:

Post a Comment