Sunday, March 7, 2010

అదన్నమాట! ఫిబ్రవరి 28 - మార్చి 6

1. హైదరాబాద్ లోని బేగంపేట్ విమానాశ్రయం లో జరింగ ఎయిర్ షో లో ఘోరమైన అపశ్రుతి చోటు చేసుకుంది. విన్యాసం చేస్తూ ఉండగా, ఒక విమానం పక్కనే ఉన్న బిల్డింగ్ లోకి కుప్ప కూలింది. ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. అసలు జన జీవినం మధ్యలో ఇలాంటి షో నిర్వంహించడమే ఒక పెద్ద తప్పు... ఇక నైన మన వాళ్ళు ఇలాంటి తప్పులు చెయ్యకుండా ఉంటారా?

2. ఈ వారం, శ్రీ కృష్ణ కమిటి హైదరాబాద్ వచ్చింది. తెరాస నాయకులు ఆ కమిటి కి తమ నివేదిక ని ఇస్తాము అని చెప్పారు. దీనితో జేఏసీ లో చిలీక పరిపూర్ణం అయ్యింది ! విద్యార్ధులు మాత్రం అస్సలు తగ్గేదే లేదు అంటున్నారు. కమిటి కి రాసి ఇస్తే వీళ్ళ సొమ్ము ఏమి పోతుంది అండి? ఇది ఇలా ఉండగా, తెదేపా మరియు లెఫ్ట్ పార్టీలు పెరుగుతున్న ధరల మీద ధర్నా నిర్వహిస్తుంటే, మధ్యలో కొంత మంది లాయేర్లు వచ్చి తెలంగాణా మీద చంద్రబాబు నాయుడు స్పష్టత తేవాలి అని అరవడం మొదలు పెట్టారు. తెదేపా కార్యకర్తలు వాళ్లకి దేహ సుది చేసి పంపారు ! కొట్టకుండా ఉండాల్సింది కాని, ధరలు మీద జరుగుతున్న ధర్నా లోకి తెలంగాణా వాదం తీసుకురావడం ఎంటండి వెటకారంగా?

3. ఇక పొతే, అసెంబ్లీ సమావేశాలు కొంచం సజావు గా సాగుతున్నాయి. మద్యలో ముఖ్యమంత్రి కి సంభందించి ఏవో ఆరోపణలు వచ్చాయి కాని ... అదీ తప్పించి బానే జరుగుతున్నాయి సమావేశాలు

2 comments:

Arun said...

State of the State
Industry representatives are blaming the government for mismanaging the situation. "The government and distribution companies knew that there would be a shortage of power but they did not make arrangements to buy power from power grids. The state cannot even buy power now because other southern states have booked the space on the power grids to take power to the respective states,"..

Sudhir said...

Thanks for the link Arun. Even I was following the debate in assembly yesterday. the government just had half baked answers to questions by opposition. we are just doomed!

Post a Comment