Sunday, March 21, 2010

అదన్నమాట!: మార్చి 14-20

1. మన టీవీ చానెల్స్ కి కొంచం చనువు ఇస్తే చాలు అండి, చెలరేగిపోతాయి! విజయశాంతి గారు చిరంజీవి గారికి చాలెంజ్ విసిరారు. దమ్ము ఉంటె తెలంగాణా లో తిరగమని, లేకపోతె ఆంధ్ర కి మకాం మార్చుకోమని. అంతే. ఎన్ టీవీ ఒక అర గంట ప్రోగ్రాం ప్రసారం చేసింది. చిరంజీవి మరియు విజయశాంతి ఒకప్పటి హిట్ జంట అని ఒక 20 నిమషాలు వారి పాత పాటలు చూపించింది. తదుపరి మూడు నిముషాలు, విజయశాంతి గారి చాలెంజ్ చూపించారు. ప్రోగ్రాం సమాప్తం ! అసలు ఇవి వార్త చానెల్స్ కన్నా వినోదం కోసం పెట్టిన చానల్స్ లాగ ఉన్నాయి. ఇంకెంత దిగాజారతాయో ముందు ముందు రోజుల్లో.

2 . రాష్ట్రం లో నీటి ఎద్దడి రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. కరెంట్ కోతలు కి అయితే అసలు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రతిపక్ష సభ్యులు వినూత్నంగా నిరసన కూడా తెలిపారు. ప్రభుత్వం మాత్రం నిమ్మ కు నీరెత్తినట్టు గానే ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమో, అవును సమస్యలు ఉన్న మాట నిజమే అంటారు. కాని వాటిని అధిగమించడానికి వారి ప్రభుత్వం చేపడుతున్న పనులు ఏంటి అని మాత్రం వివరించారు. గట్టిగ అడిగితె, ప్రతిపక్షం మీద దాడికి దిగుతారు. కష్టాలు పడవలసింది మాత్రం సామాన్యుడే!

3 . ఫ్రీ జోన్ అంశం మళ్ళి తెర మీదకి వచ్చింది. పోలీస్ నియమకలకి గాను సుప్రీం కోర్ట్ హైదరాబాద్ ని ఫ్రీ జోన్ గా పేర్కొంది. దీనికి అనుకునట్టే తెలంగాణా వాదులు వ్యతిరేకత తెలిపారు. అయితే ఉన్న గొడవలు చాలవు అన్నట్టు, మళ్ళి కోతవి కొని తెచుకోవడం ఎందుకు అని, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ లో ఏకంగా రాజ్యాన్గాన్నే సవరించమని కేంద్ర ప్రభుత్వం ని కోరుతూ తీర్మానం పెట్టారు. దీనినే వ్యతిరేకిన్చేవాళ్ళు స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళే లోపలే ఆ స్థానం లో ఉన్న డిప్యుటీ స్పీకర్ తెర్ర్మానాన్ని సభ ఆమోదించినట్లు ప్రకటించేశారు !! అదన్నమాట!

0 comments:

Post a Comment