1. ఈ వారం చెప్పుకోదగ్గ విశేషం ఏమిటి అంటే, మన అసెంబ్లీ లో జరిగిన చర్చలు. ప్రతిపక్షం వాళ్ళు ప్రబుత్వం ని పలు సమయ్సల మీద నిల దీసారు. వరద బాధితులకి ఇంకా అందని డబ్బుల గురుంచి అడిగితె, మంత్రి గారు .... ఎం మాట్లాడుతున్నారు మీరు, అసలు అలాంటిది ఏమి లేదు అని చెప్పారు. కడప లో బ్రహ్మిని స్టీల్స్ కి ప్రభుత్వం ఎందుకు కొమ్ము కాస్తుంది అని అడిగితె, తిరిగి ప్రతిపక్షం మీద ఎదురు దాడి చేసారు. జల యజ్ఞం ప్రాజెక్ట్లు ఎందుకు పూర్తి అవ్వటం లేదు అంటే, ఎట్టా కేలకు ప్రభుత్వం ఒప్పుకుంది - నిధులు లేవు అని ! భూ సేకరణ సమస్యల కూడా చాలా ఉన్నాయి అని చెప్పండి ప్రభుత్వం. తొమ్మిది గంటల విద్యుత్ ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదు అని ముఖ్యమంత్రి గారు తేల్చి చెప్పారు. సరే అదీ పక్కన పెట్టండి, అసలు మామూలు విధ్యుత్ సరఫరా కూడా అస్తవ్యస్తంగా ఉంది కదా అని ప్రశ్నిస్తే, అవును, కొన్ని సమస్యలు ఉన్నాయి, కాని రేపటి నుంచి ఉండవు అని మంత్రి గారు సెలవు ఇచ్చారు . అంతా పచ్చిబూటకం. ప్రతి రోజు అలానే ఉంది పరిస్థితి. నగరాల లోనే రెండు నుంచి మూడు గంటలు కొత్త ఉంది. ఇంకా పట్టణాలు, గ్రామాల సంగతి సరే సరి.
2. రెండు ఎన్కౌంటర్లు జరిగాయి ఈ వారం. ఇద్దరు పెద్ద నక్సల్ నాయకులని పోలిసీలు చంపేశారు. ఒకలు శాఖమూరి అప్పారావు. చాలా పెద్ద పెద్ద హత్యలు, హత్య యత్నాలలో కీలక పాత్ర పోషించాడు. కే.పి.వ్యాస్ ,ఉమేష్ చంద్రాల హత్యలలో కీలక పాత్రహారి. చంద్రబాబు నాయుడు మీద జరిగిన హత్య యత్నం లో కీలక పాత్రధారి. నిరుడు చర్చలకి వచ్చినప్పుడు రామకృష్ణ ఆయుధాలను అండ చేసింది అప్పారావు కే. రెండో నాయకుడు టెక్ రమణ . దక్షిణ భారతానికే ఈయన టెక్నికల్ ఇంచార్జ్ అంట ! కాని మీడియా లో కొంత మంది వీళ్ళ ఇద్దర్ని హీరోస్ లాగ చిత్రకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంత మంది మరణానికి కారణం ఆయినా వెళ్ళాను అసలు హీరోలు గా ఎలా చూస్తారు అండి జనం? మీడియా కి కూడా కొంచం సమంవయం ఉండాలి కదా...
3. ఇక పొతే ఈ వారం జరిగిన అత్యంత హాస్యాస్పదమైన ఘటన - తెలంగాణా ఐక్య కార్యాచరణ సమితి తెలుగు దేశం పార్టి ని బహిష్కరించింది anta !! అసలు ఇకసా ఈ పెద్ద జోక్ , దానికి తోడు వీళు బహిష్కరించుకోవటం ఒకటి మళ్ళి ! ఇందులో ఇప్పుడు మిగిలింది తెరాసా మాత్రమె !
0 comments:
Post a Comment