Sunday, October 31, 2010

అదన్నమాట! : అక్టోబర్ 24-30

హైదరాబాద్ వాసులకి తెలుగు లలిత కళా తోరణం సుపరిచితమే. ఎన్టీఆర్ కట్టించారు. విశాలమైన ప్రాంగణం లో వివిధ ప్రోగ్రామ్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి. మన కలల్ల్ని ప్రోత్శాహించే మంచి వేదిక. గౌరవనీయులు శ్రీమాన్ టి. సుబ్బిరమరేద్ది గారికి ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది ! అసలు ఈ ప్రాగణం పేరులో తెలుగు ఎందుకు ఉండాలి ? దాని బదులు గా, శ్రీమాన్ రాజీవ్ గాంధి గారి పేరు జోడిస్తే కాని, దీనికి సార్ధకత లేదు అని నిశ్చయించారు. లలిత కల తోరణం ని తన డబ్బుల తో కొత్త రూపం ఇచి, దానికి రాజీవ్ లలిత కళా తోరణం అని నామకరణం చేస్తునట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతించింది . అయితే, తీవ్రమైన వ్యతిరేకత ఎదురు అవ్వడం తో, సదరు పెద్ద మనుషులు కరుణించి, రాజీవ్ తెలుగు లలిత కల తోరణం అని నామకరణం చేసారు ! ఇంకా వ్యతిరేకత ఆగకపోవడం తో, రాజీవ్ పేరుని కూడా తొలగిస్తునట్టు సమాచారం !

మాకు చరిత్ర చెప్పే మాస్టారు ఒక సారి ఇలా అన్నారు - చరిత్ర ని గౌరవించకపోతే, నువ్వు చరిత్ర హీనుడవి అయ్యిపోతావు ! ఈ రాష్ట్ర చరిత్ర లో ఎందరోమహానుభావులు , భాష కోసం శ్రమించిన పూజ్యులు ఎంతో మంది ఉన్నారు. కళల అభివృధి కోసం కష్టపడిన కళాకారులు చాలా మంది ఉన్నారు. వీరందరినీ విస్మరించి, ఇప్పటికే మన రాష్ట్రం కోసం చెప్పుకోదగ్గ పని ఏమి చెయ్యని శ్రీమాన్ రాజీవ్ గాంధి గారి పేరుని , తమ స్వామీ భక్తీ చాటు కోవడానికి జరుగుతున్న ఈ ప్రయత్నం అత్యంత గర్హనీయం. కాని, మన నేతలు ఎప్పటికీ నేర్చుకోరు - వాళ్ళ భక్తీ ని ఎలా ఎలా ప్రదర్శించాలో ఆలోచిస్తూనే ఉంటారు ! అదన్నమాట!

0 comments:

Post a Comment