Friday, October 8, 2010

మాకు ఓదార్పు ఏది ?

గౌరవనీయులైన శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి నమస్కరించి రాయునది ఏమనగా..

మీ అధికార దాహాన్ని దహించి వేసిన అధిష్టానం ని ధిక్కరించి మీరు ఓదార్పు యాత్ర చేపడదాము అని నిర్ణయించినప్పుడు, "అబ్బో , మన దగ్గర ఇలాంటి కాంగ్రెస్స్ నాయకులు కూడా ఉంటారా " అని ఆశ్చర్యపోయాను. ఆ తరువాత యాత్ర లో భాగంగా, మీరు వరంగల్ వెళ్తున్న సందర్భం లో, వెళ్ళదు వెళ్ళదు అని ఎన్ని బెదిరింపులు వచ్చినా, ధైర్యం గా బయల్దేరితే, ఎట్టకేలకు ఈ తెరాసా నడిపిస్తున్న చెత్త రాజకీయాలకు నిలబడే ఒక వ్యక్తీ ఉన్నాడు అని కొంచం (కొంచమే !) సంబరపడ్డా. జిల్లా కి వారం చొప్పున కేటాయిస్తూ, అడపా దడపా కొన్ని కుటుంబాలని ఒదార్స్తు , విచ్చలవిడి గా మీ తండ్రి గారి విగ్రహాలని ఆవిష్కరిస్తూ వెళ్తుంటే, ఒకే దెబ్బ కి రెండు పిట్టలు తరహ లో మీరు యాత్ర చేస్తున్నారు , ఇది అధిష్టానం ని తప్పక ఇబ్బంది పెడుతుంది అని విశ్లేలించా.

ఆ తరువాత సాక్షి టీవీ లో, మరియు పత్రిక లో మీరు ఎంత గొప్ప వారో, మీరే చెప్పుకుంటుంటే, వినడానికి భలే వినసొంపు గా ఉండేది!. మీ నాన్న గారి కన్నా గొప్ప వ్యక్తీ మరొకరు లేరని, ఆ తరువాత అంతటి గొప్ప వ్యక్తీ మీరే అని , మీరు జీతాలు ఇచ్చే యాంకర్స్ చెప్తుంటే, విని ఆనంద పరవసితుడనైయ్యా ! సరే పోన్లే, నెల లో ఒక వారం రోజులే కదా, మూడు వారాలు ప్రసాంతంగా ఉండచ్చు లే అని సర్దుకుపోయ !

ఇలా మేము సర్దుకుపోతునాము అని మీకు సమాచారం అందినట్టు ఉండి , మమల్ని ఇంకా భాదించాలి అని మీరు గట్టి నిర్ణయం తీసుకునట్టు ఉన్నారు ! ఒక్కో జిల్లా ని మీరు వారల తరబడి "ఒదార్స్తూ" ఉంటె, ఆఖరికి టీవీ 9 కూడా "జగన్ యాత్ర మీద జనాలకి విసుగు వచ్చిందా " అని అడిగేసాడు!

మీరు సా...గిస్తున్న ఓదార్పు యాత్ర ని చూసి చూసి బాధపడుతున్న మాకు ఓదార్పు కావాల్సిన పరిస్థితి వచ్చింది ! అమ్మో, వద్దు లెండి. ఇంకో ఓదార్పు యాత్ర చేసే సామర్ధ్యం మీలో ఉన్న , తట్టుకునే శక్తి మాలో అస్సలు లేదు. కావున మా యందు దయ ఉంచి, మీరు ఓదార్చడం ఆపితే, అత్యుతమం గా ఉంటుంది అని భావన!

ఇట్లు, మీ భవదీయుడు
సుంకర సుధీర్ కుమార్

4 comments:

venkatesh said...

wow... andarki anpinchede vishayame ainappatiki presentation bagundi melo kanipinchani script writer dagivunnadu....

Sudhir said...

@venkatesh :) thank you :) ... okkapudu saradaga scripts kuda raasevaadini :)

am not sure if you read this...veturi chanipoyinappudu raasa -

http://serious--fun.blogspot.com/2010/05/blog-post.html

venkatesh said...

ippude chadiva chala bagundi and ah songs anni bagunnayani baga hit ayyayi ani telsu kani veturi garu rasaru ani me post chusaka telsindi any hw thanks 4r ur info... nenu me blog ni august nunche follow avutunna... meru may lo post chesaru ga anduvalna chudaledu apatki me gurinchi me blog gurinchi naku telyadu...

Ramesh said...

great post...... :)))

Post a Comment