Tuesday, May 25, 2010

"ఏ కులము నీదంటే, గోకులము నవ్వింది"...


పద ప్రయోగం లో ఒక శక్తీ ఉంటుంది. అది ఆలోచనల్ని రేకేతిస్తుంది. ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆవేశాన్ని పుట్టిస్తుంది. అప్పుడు అప్పుడు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది ! పద ప్రయోగం లో ఉన్న ఈ శక్తీ ని పండితులు ఎలాగో అర్ధం చేసుకుంటారు. కాని పామరులు కూడా అర్ధం చేసుకుని, ఆస్వాదించి, ఆనందపదేటట్టు గా కవిత్వాన్ని మనకి అందించిన వాళ్ళలో వేటూరి సుందర రామ మూర్తి గారు బహుశా చివరి వారు ఏమో.

ఆయన అందించిన పాటల్లో వైవిధ్యాన్ని వర్ణించడం సులవైన విషయం ఏమి కాదు. అంత వైవిధ్యం పండిచడం ఆయనకే చెల్లింది. ఒకే సినిమా లో "కృషి ఉంటె మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు" మరియు "ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి" అని రాయడం అయన వల్లనే అయ్యింది. "ఆకు చాటు పిందె తడిసే " అని రాసిన, "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" అని రాసిన, ఆయనకే చెల్లింది. "నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకు ఇంత తపన " అని రాసిన "శుభలేక రాసుకున్న యదలో ఎప్పుడో" అని రాసిన, అయన కలంకే సాధ్యం అయ్యింది. గోదావరి గురుంచి రాస్తూ "బ్రతుకు తెరువు ఎదురీతే గా" అని అల్లినా, "అడగను లే చిరునామా ఓ మైన, ఏమైనా" అని రాసిన, అయన చేతికే సాధ్యం అయ్యింది.

ఇలా రాసుకుంటే పొతే, చాలా చెప్పచు. అలా చెప్పుకుంటే పొతే, చాలా నేమరవేసుకోవచ్చు. నేమరవేస్తున్న కొద్ది ఆనిముత్యాలు బయట పడుతూనే ఉంటాయి, ఇలాంటి కవిత్వం విని ఆస్వాదించగలిగే అవకాశం మనకి వచ్చింది అని గర్వ పడక మానలేము. ఆయన వదిలి వెళ్ళిన పద సంపదని చూసి ఆశ్చర్య పడక ఉండలేము. ఆయన మరణం తెలుగు సినిమా కి తీరని లోటు అని చెప్పడం కన్నా, తెలుగు సాహిత్యం కి తీరని లోటు అని చెప్పడం సబబు.

ఆయన రాసిన గీతాల్లో, ఇప్పటికి ఎప్పటికి గుర్తు ఉండి పోయే వాక్యం - "ఏ కులము నీదంటే, గోకులము నవ్వింది. యాదవుడు , మాధవుడు మా కులమే లెమ్మంది." భాష కి వన్నె తెచ్చి, సగటు మనిషి కూడా ఇంతలా ఆనంద పడేటట్టు చేసిన వేటూరి కి జోహార్లు.

4 comments:

Anonymous said...

చాలా చక్కగా చెప్పారు. జొన్నావిత్తులగారు అన్నట్లు వేటూరిగారికి సరైన నివాళి అర్పించటం అంటే అందరూ పిల్లలకి సరైన తెలుగు భాష నేర్పించటమే.

Morus said...

Awesome man he is...

Karthik said...

chaala bagundi.... veturi gari gurunchi cheppataniki idi oka machu tunaka

Chandu said...

Truly he is a genius!

Post a Comment