1 . క్రిందటి వారం అంతా హైదరాబాద్ లో పోలీస్ తనిఖీలు చాల ముమ్మరంగా సాగాయి. ఎట్టకేలకు ఒక తీవ్రవాది ని పోలీసులు అర్రెస్ట్ చేసారు. మూడేళ్ళ క్రితం ఒడియన్ దియేటర్ మీద బాంబ్ వేసాడు. మళ్ళి ఇప్పుడు హైటెక్ సిటి లో ఒక కంపనీ మీద బాంబు వెయ్యడానికి ప్లాన్ వేసాడు అంట. మొత్తానికి పోలీసుల శ్రమ ఫలించింది. ఈ సంఘటన వల్ల ఇంకో విషయం తెలుసుకోవాల్సింది అమితి అంటే, ప్రజలు కూడా ఎప్పటికప్పుడు చుట్టుపక్కల పరిశీలిస్తూ ఉండాలి. అనుమాస్పదం గా ఏమి అనిపించినా వెంటనే పోలీసులు దృష్టి కి తీసుకురావాలి.
2 . ఇన్నాలు మనం ప్రతిపక్ష నాయకుల ఆరోపణలు విని విని విసిగిపోయాము అని కాంగ్రెస్స్ ఎంపీ రాయపాటి సాంబశివ రావు గారు అనుకున్నట్టు ఉన్నారు. అందుకే ఈ సారి తనే స్వయంగా విమర్సానాస్త్రాలు విసిరారు. రాష్ట్ర క్యాబినెట్ లో అవినీతి పరులు చాలా ఎక్కువ గా ఉన్నారు అని సంచలన వ్యాఖ్యలు చేసారు. సొంత పార్టి మనుషులే ఇంహ్త బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ ఉంటె ఏమి చెయ్యాలో తోచని స్థితి కాంగ్రెస్స్ పార్టి డి ఇప్పుడు. రాయపాటి గారు మాత్రం జిల్లా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తో కయ్యానికి సిద్దం అయ్యారు. పని లప్ అని రాష్ట్ర క్యాబినెట్ మొత్తాన్ని దుమేత్తి పోశారు ! రాయపాటి గారు చెప్పిన దాంట్లో కొత్త విషయం ఏమి లేదు అనుకోండి, కాని కాంగ్రెస్స్ పార్టి ఎంపీ గా అయన చేసారు కాబట్టి, ఇంత సంచలనం రేగింది.
3 . ఇది ఇలా ఉండగా, ముఖ్యమంత్రి గారు సాక్షి పత్రిక మీద మళ్ళి విరుచుకుపడ్డారు అంట. సొంత పార్టి ఎంపీ నడిపిస్తున్న పత్రిక లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత లా వార్తలు వస్తు ఉంటె, మంత్రులు ఎందుకు ఏమి మాట్లాడడం లేదు అని గట్టిగ అడిగినట్టు సమాచారం ! రోశయ్య గారి కోపాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు అనుకోండి, అదీ వేరే విషయం లే!

1 comments:
Once cool, Hyderabad now a burning cauldron.
Post a Comment