Sunday, May 30, 2010

అదన్నమాట!: మే 23-29

1 . శ్రీ కాళహస్తి గుడి గోపురానికి పాతికేళ్ళ క్రితం కొంచం డ్యామేజ్ ఏర్పడింది. దాన్ని ఆధికారులు విస్మరిస్తూ వచ్చారు. క్రిందటి వారం, ఈ గోపురం కుప్ప కూలిపోయింది. కూలిపోయే రెండు రోజుల ముందు tv9 వాళ్ళు గోపురం కూలిపోయే దిశలో ఉండి అని చూపించారు. అధికారులు వెళ్లి, నిజమే అని గ్రహించి, 150 అడుగుల మేర జనాన్ని రానేయకుండా ఏర్పాట్లు చేసారు. ఇందు వాళ్ళ, గోపురం కూలిపోయినప్పుడు ప్రాణ నష్టం ఏమి జరగలేదు. 500 ఎల్ల క్రితం శ్రీక్రిష్ణదేవరయుల వారు ఈ గోపురాన్ని కట్టించారు. వివిధ రాజ్యాల పై ఆయన సాధించిన విజయాలకు చిహ్నం గా ఈ గోపురాన్ని నిర్మించారు. అదీ ఇవ్వాళ మన అసమర్ధత వల్ల కూలిపోయింది.

2 . ఆంధ్రుల అభిమాన నటుడు శ్రీ కేసీఆర్ గారు జగనన్న వరంగల్ కి వస్తే, "యుద్ధ వాతావరణం" సృష్టిస్తాము అని హెచ్చరించారు. జగనన్న వరంగల్ ఎందుకు వెళ్తున్నారు? ఓదార్పు యాత్ర పేరు తో, తన తండ్రి వై ఎస్ ఆర్ చనిపోయినప్పుడు, ఆ బాధ వల్ల చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించడానికి రాష్ట్ర పర్యటన చేప్పట్టారు. ఇందులో భాగంగానే వరంగల్ జిల్లా కి కూడా వెళ్ళాలని అని అనుకున్నారు. కే సి ఆర్ ఒప్పుకోలేదు. ఇతర తెలంగాణా వాదులు కూడా ఒప్పుకోలేదు. తెదేపా లో కొంత మంది తెలంగాణా నాయకులు కూడా జగన్ వరంగల్ వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారు. ఆఖరికి ముఖ్య మంత్రి, హొం మంత్రి, కాంగ్రెస్స్ హాయ్ కమాండ్ కూడా ఈ యాత్ర వరంగల్ లో చేపదిత్చల గొడవలు జరుగుతాయి కాబట్టి, వెళ్ళాడు అని చెప్పారు. జగన్ వినలేదు. ట్రైన్ ఎక్కాడు. తెలంగాణా వాదులు పట్టాల మీద చెట్లు పడేసారు. కొన్ని చోట్ల పట్టాలు మీద కూర్చున్నారు. వరంగల్ లో అయితే ఇంకా పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. మధ్యలోనే జగన్ ను అర్రెస్ట్ కూడా చేసారు. ఇదేం ప్రజా స్వామ్యం అండి? జగన్ తో చాలా విభేదిన్చాచు మనం, కాని అతని అధికారాలన్నీ అడ్డుకునే హక్కు ఈ రౌడీలు ఎవరు అండి? రోశయ్య ప్రభుత్వ అసమర్ధత కి ఇది ఇంకో మంచి నిదర్శనం.

3 . చిరంజీవి గారు ఢిల్లీ వెళ్ళరు ఈ వారం. సోనియా గాంధి ని కలిసారు. ఆయన రాజ్య సభ ఎన్నికల్లో పార్టీ నుంచి ఎవర్ని పోటికి నిలబెట్టారు అంట. శుభం. ఆయన రాజకీయ వినాసననికి ఇది ఇంకో మెట్టు. శుభం !

0 comments:

Post a Comment