1 . రాజధాని లో పోలీస్ పహారా చాలా ఎక్కువ అయింది. ఈ వారం ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది అని సమాచారం రావడం తో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి సెక్యురిటి ని కూడా పెంచారు. వివిధ షాప్లు, మాల్స్ లో సెక్యురిటి ని కూడా పెంచారు. కొన్ని షాపుల్లో భద్రత సరిగ్గా లేనందు వల్ల వాళ్ళకి అక్షింతలు కూడా వేసారు ! ప్రజల్ని కూడా అప్రమతంగా ఉండమని పోలీసిలు చెప్పడం జరిగింది. ఇలా సమాచారం వచినప్పుడు మాత్రమె కాకుండా, ప్రజలు మాత్రం ఎప్పుడు అప్రమత్తం గానే ఉండాలి .
2 . రాష్ట్రం లో తాగు నీటి సమస్య రోజు రోజుకి విషమిస్తుంది. నీటి ఎద్దడి అంతా ఇంత కాదు. చాలా పల్లెల్లో మహిళలు కిలోమీటర్లు దూరం నడిచి మరి నీళ్ళు తోడుకుని రావాల్సి వస్తుంది. సక్రమమైన నీటి నిలువ చర్యలు తీసుకోకపోవడం ఒక ముఖ్యమైన కారణం ఈ ఎద్దడి కి. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలి , కాని రోశయ్య గారి ప్రభుత్వం ఎప్పటికి నిద్రావస్త లోనే ఉంటుంది కదా మరి ! ప్రజలకి ఈ కష్టాలు తప్పవు, ప్రభుత్వానికి ఈ కష్టాలు పట్టవు!
3 . తెలంగాణా ఉప ఎన్నికల వేడి మాదే ఎండల తో పాటు పెరుగుతుంది ! తెదేపా లో ఒక వర్గం పోటి చెయ్యకూడదు అంటే, ఇంకో వర్గం లేదు పోటి చెయ్యాల్సిందే అని అంటుంది! కాంగ్రెస్స్ లో కూడా ఇదే కథ. ఎతోచి తెరెసా నుంచి రాజీనామా చేసిన వాళ్ళకి చెమటలు పడుతున్నాయి. ఊపుకుంటూ వెళ్లి రాజీనామా చేసారు. ఇప్పుడు గెలుస్తామో లేదో తెలియని దుస్థితి. పోనీ రాజీనామా చేసిననందుకు తెలంగాణా వస్తుందా అంటే, ఆ దిక్కు కూడా లేదు ! తెలంగాణా ఐక్య కార్యాచరణ సమితి అసలు ఉందొ లేదో కూడా ఇప్పుడు తెలియదు ఎవరకి ! అదన్నమాట!
1 comments:
State can press Centre for more gas after Supreme Court ruling
Post a Comment