క్రిందటి వారం వ్రాయడం కుదరలేదు. రెండు వారాలకి కలిపి ఇప్పుడు చర్చిద్దాము. కేంద్ర ప్రబుత్వం ఎట్టకేలకు రాష్ట్రం లో జరుగుతున్న పరిణామాలని కూలంకుషంగా అధ్యనయం చెయ్యడానికి కమిటి వేసింది. జస్టిస్స్ శ్రీకృష్ణ ఈ కమిటి కి సారధ్యం వహిస్తారు. కమిటి ప్రకటించిన వారం కి గాను ఆ కమిటి పరిధి లోకి వచ్చే అంశాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. తీరా ప్రకటించాక చూస్తే తెలంగాణా నేతలు ఖంగు తిన్నారు! తెలంగాణా ఏర్పాటు అసలు అవసరమా కాదా అనే విషయం అధ్యయనం చెయ్యడానికి ఈ కమిటి వేసినట్టు సుస్పష్టం అయ్యింది. ఇంక మన తెరాసా నాయకుడు ఎందుకు ఊరుకుంటారు ? ఇది ఒక దిక్కు లేని కమిటి అని తేల్చి చెపారు. రాజీనామాలు చేస్తాము అని మళ్ళి ప్రగల్భాలు పలికారు. రెండు రోజులు ఆగి రాజీనామాలు చేసారు కూడా. అయితే కాంగ్రెస్స్ మరియు తెలుగు దేశం నాయకులూ మాత్రం కొంచం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. కమిటి ని డిసంబర్ 31 లోపల నివేదిక సమర్పించామని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ పది నెలలు కమిటి కి సహకరించి నివేదిక చూసి అప్పుడు మళ్ళి ఉద్యమ బాట పడితే మెరుగగు గా ఉంటది ఏమో అని వీళ్ళ ఆలోచన. అరాచకానికి దిగకుండా ప్రజాస్వామ్య పద్దతి లో వెళ్ళాలి అని చాలా మంది నేతలు ఆలోచిస్తున్నారు. నిజం చెప్పాలి అంటే అదే మంచి ఆలోచన, కాని వీల్లేదు ఉద్యమం పేరుతో అరాచకం కి దిగాలి అని కొన్ని శక్తులు పూనుకుంటే అసలకే మోసం వస్తుంది . పై పెచ్చు మన రొసైహ్ గారి ప్రభుత్వం ఎంత నిస్సహాయం గా ఉంటాదో మన అందరికి తెలిసిందే కదా. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు కూడా అఆరంభం అవుతున్నాయి. పది మంది కాంగ్రెస్స్ ఎమ్యెల్యేలు రాజీనామా చేసిన ప్రభుత్వం ఉండదు ! మరి ఈ వరం లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి మరి ! అదన్నమాట!
1 comments:
The anatomy of Telangana agitation
Found some new facts and insights
Post a Comment