Sunday, February 5, 2012

అదన్నమాట! : జనవరి 29 - ఫిబ్రవరి 4


దాదాపు 72 మంది ఐఏఎస్ ఆఫీసర్లు మొన్న ముఖ్యమంత్రి ని కలిసారు. ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయాలు నేపెధ్యం లో ఆఫీసర్లు ని బలిపసువులు చెయ్యడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. వాళ్ళ ఆవేదన కి నేపధ్యం ఈ మధ్య ఇద్దరు సీనీయర్ ఐఏఎస్ ఆఫీసర్ల అర్రెస్ట్ ఉదంతం. 

యైఎసార్ గారు అధికారం లో ఉనప్పుడు విచ్చలవిడి గా ప్రబుత్వ ఖజానా దోపిడీ కి గురు అయ్యింది అని తెలిసిందే. అయితే, ఆ దోపిడీ ని ప్రోత్సహించింది అప్పటి మంత్రులు, ఇతర రాజకీయ నాయకులు. శ్రీ లక్ష్మి అనే ఐఏఎస్ ఆఫీసర్ ని అక్రమ గనుల కేస్ లో అర్రెస్ట్ చేసారు. ఈ కేస్ లో ఒక్క రాజకీయ నాయకుడు కూడా అర్రెస్ట్ అవ్వలేదు. రాజకీయ అండ దండలు లేకుండా కేవలం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంత పెద్ద నిర్ణయం తీసేసుకుంటార ? బీ. పీ . ఆచార్య గారిని ఎమ్మార్ కుంభకోణం కేస్ లో అర్రెస్ట్ చేసారు. ఏమార్ లోని స్థలాలు, ఇల్లులు తక్కువ రేట్ కి అమ్ముతునట్టు చూపించి, అమ్మిన వల్ల దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకునారు అని ఒక అభియోగం. అమ్మింది ఏమో పలుకుబడి ఉన్న సిని తారలు, రాజకీయ నాయకుల కి. ఆచార్య గారు APIIC కి ఎండీ . APIIC అధ్యక్షుడు రాజకీయ నాయకుడు ఉంటాడు - అయిన ఈ కేస్ లో ఒక్క రాజకీయ నాయకుడ్ని కూడా అర్రెస్ట్ చెయ్యలేదు. 

యైఎసార్ గారి హయాం లో ఇలాంటి అక్రమాలు ఇంకా ఎన్నో ! అన్నిటికి ఆఫెసార్లదే బాధ్యత మరి? ఆఫీసర్ల ఆవేదన కి చాలా అర్ధం ఉంది - ఇది నేను అంటున్న మాట కూడా కాదండి. సాక్షాతూ రాష్ట్ర ఆర్ధిక మంత్రి గారు నిన్న ఇదే మాట అన్నారు. "దోచుకున్న వారు ఏమో యాత్రలు చేస్తున్నారు , ఆఫెసార్లు మాత్రం జైలు కి వెళ్తున్నారు" అని ఆయనే చెప్పారు. ఈయన ఒక కాంగ్రెస్స్ మంత్రి - దోచుకునప్పుడు జగన్ గారు కాన్గేస్స్ వ్యక్తే - ఇది మన రాష్ట్ర దరిద్రం. అదన్నమాట! 

0 comments:

Post a Comment