Sunday, February 26, 2012

అదన్నమాట! ఫిబ్రవరి 19-25


ఈ వారం అసెంబ్లీ లో చాల వాడి వేడి చర్చలు జరిగాయి అండి. ప్రతిపక్షం వాళ్ళు అంకెల తో సహా పాలక పక్షం వాళ్ళని ప్రశ్నలు అడిగితె, పాలకపక్షం వాళ్ళు మళ్ళి పాత పాటే పాడారు. తెలుగు దేశం వాళ్ళు ప్రశ్నిస్తే, మీరు అధికారం లో ఉన్నప్పుడు ఎం పీకారు అని తెగ అడిగేశారు లెండి. మిగతా ప్రతిపక్షాలు అడిగితె, పెద్దగా పట్టించుకోలేదు కూడా! 

ముందుగ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతున్న తీర్మానాన్ని చర్చకు పెట్టారు. లోక్ సత్తా అధినేత జే పీ గారు మొదలు పెట్టారు. అసలు ప్రసంగం లో అవినీతి గురుంచి కాని, మద్యం వ్యాపారం గురుంచి కాని ప్రస్తావన కూడా లేకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏమి సమాధానం ఇవ్వలేదు. తరువాత చంద్రబాబు గారు మూడు గంటలు మాట్లాడారు. ఎప్పటికప్పుడు ఆయన మీద బురద జల్లడమే పని గా కొంత మంది నేతలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఏక వకాహనం లో సంభోదిస్తూ వచ్చారు. ఒక దాస లో ఏమో "మీరు హైటెక్ సిటి గురుంచి మాట్లాడితే, మేము ఎమ్మార్ గురుంచి మాట్లాడాల్సి వస్తది" అని కూడా అన్నారు అండి! ఎమ్మార్ అక్రమాలు అన్ని వైఎసార్ గారి హయాం లో జరిగాయి - దానికి హైటెక్ సిటి కి సంబంధం ఏంటి అండి ? యైఎసార్ గారి హయాం లో జరిగిన అవినీతి కి తెలుగు దేశం పార్టి కి సంబంధం ఏంటి అండి అసలు? 

పైగా, ముఖ్యమంత్రి గారు ఏమో రాజీవ్ యువ కిరణాలు వల్ల లక్ష మంది యువత కి ఉద్యోగాలు వచేశాయి అంట! ప్రతిపక్షాన్ని పక్కన పెట్టండి - కాంగ్రెస్స్ ఎమఎల్యేలే ఈ విషయాన్నీ అంగీకరించడం లేదు! ఆ లక్ష మంది పేర్లు , ఉద్యోగాలు ఎక్కడ ఎక్కడ చేస్తునది - ఈ వివరాలు మాత్రం ఎంత అడిగిన ప్రబుత్వం ఇవ్వటం లేదు. ఎందుకు సంసయిస్తున్నారు ?

ఆ తరువాత మద్యం వ్యాపారం మీద చర్చ మొదలు అయ్యింది. తన బందు వర్గం మొత్తం 30 మందికి మద్యం వ్యాపారాలు ఉన్నట్టు బొత్స గారే అంగీకరించారు. ఆయన చర్చ కు రాలేదు. మళ్ళి ముఖ్యమంత్రి గారు పాత పాటే పాడారు. చంద్రబాబు త్రుటి లో జైలు కి వెళ్ళే పరిస్థితి నుంచి 2003 లో తప్పించుకున్నారు అని మొదలుపెట్టారు. మళ్ళి ఇద్దరి మధ్య కోట్లత మొదలు అయ్యింది. ముఖ్యమంత్రి గారికి ఒక చర్చని ఎలా ప్రక్కదోవ పట్టించాలో బాగా తెలిసిపోయింది అనుకుంటాను. ప్రతిపక్ష నాయకుడు మీద బురద జల్లడం, ఇక ఆ పైన కోట్లాడుకోవడం. మరుసటి ఉదయం పత్రికల్లో ఈ కోట్లత గురుంచి రాస్తారు కాని అసలు చర్చ గురుంచి రాయరు కదా ! అదన్నమాట! 

0 comments:

Post a Comment