Sunday, November 14, 2010

అదన్నమాట!: నవంబర్ 7-13

హైదరాబాద్ లో అసెంబ్లీ కి 2 చదరపు కిలోమీటర్ల విస్తీరణం లో ఎవ్వరు ధర్నాలు చెయ్యకూడదు. అటువంటిది, మొన్న సాక్షాతూ ముఖ్యమంత్రి గారే కాంగ్రెస్స్ పార్టి నిర్వహించిన ధర్నా లో పాల్గునారు. ఇంతకి ఈ ధర్నా సంగతి ఏంటి ? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు సుదర్శన్ సోనియా గండి గారిని ఏవో మాటలు అన్నారు అంట ! రాజీవ్ గాంధి ని ఇందిరా గాంధి ని చంపించింది సోనియా గాంధి అని అన్నట్టు సమాచారం. అలా అని ఉంటె, తీవ్రంగా ఖండించాల్సిన విషయమే. కాని, ఇలా సాక్షాతూ ముఖ్య మంత్రి మరియు మిగతా మంత్రులు, ఇతర నాయకులు, ఇలా రూల్స్ ని బ్రేక్ చేసి మరి సోనియా గాంధికి వారి విధ్యేట మళ్ళి చాటుకునే అంత అవసరం ఏమి వచ్చింది అండి? రాష్ట్రానికి ఎన్నో అన్యాయాలు జరిగినప్పుడు, సదరు ముఖ్యమంత్రి గారు ధర్నాలకు దిగుతార అండి?
ఇది ఇలా ఉండగా, tv9 వారు తెదపా లో చీలిక కోసం తెగ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని, ఒక అత్యద్భుతమైన కల్పిత కథ ఒక ప్రసారం చేసింది. తల తోక లేని ఈ కథ ని అసలు ఎవరు చెప్తే ప్రసారం చేసారో, నయంగా tv9 మనకి చెప్పాలి, కాని న్యాయంగా వ్యవహరిస్తే, అదీ tv9 ఎందుకు అవుతుంది లెండి :D

0 comments:

Post a Comment