హైదరాబాద్ లోని పాత బస్తి కర్ఫ్యూ ఇంకా కొనసాగుతుంది. గత రెండు రోజులు గా రెండు మూడు గంటలు కర్ఫ్యూ ని సడలించిన, పరిస్థితులు ఇంకా మామూలు అవ్వడానికి ఒకటి రెండు రోజులు పడుతుంది. ఈ వారం లో ముగ్గురు అల్లర్లు వాళ్ళ చనిపోయారు. ముగ్గురికి ఈ అల్లరలతో ఎటువంటి సంభందం లేదు. వీరు చావు కి ఎవరిదీ అండి బాధ్యత? కర్ఫ్యూ విధించిన తరువాత వైద్య సహాయం అందాకా ఇద్దరు మృతి చెందారు. వీరి చావు కి ఎవరిదీ అండి బాధ్యత? గురువారం కర్ఫ్యూ సదలించినప్పుడు లీటర్ పాలు ని వంద రూపాయలకి అమ్మారు. సామాన్యుడి నడ్డి విరిచారు. దీనికి ఎవడిది బాధ్యత? రోజు కూలి చేసుకునే వాళ్ళకి ఆదాయం లేకుండా పోయింది. దీనికి ఎవడిది బాధ్యత? తగ్గిపోతుంది అనుకున్న వాళ్ళ ప్రతిష్ట ని పెంచుకోవడానికి ఎమైయెం పార్టి వాళ్ళు ఒక పండగకి మొత్తం ఆకు పచ్చ జెండాలు పెట్టారు. ఆ జెండాలను పీకి హనుమాన్ జయంతి కోసం హిందువులు ఆరంజ్ జెండాలు పాతారు. దీంతో మొదలు ఆయినా గొడవ, చినికి చినికి వాన అయ్యింది. అయితే అదీ వాన గా మారడానికి కారణం మాత్రం చాలా పెద్ద పధకమే అని చెప్తునారు. సాక్షి ఏమో పాకిస్తాన్ ఐఎసై కుట్ర ఉంది అని చెప్తుంది. కాంగ్రెస్స్ లో ఒక వర్గం ఏమో రోశయ్య ని దింపడానికి వేరే వర్గం పన్నిన పధకం అని చెప్తుంది. భిజేపీ వాళ్ళు ఏమో ఇది కేవలం ఎమైయెం వాళ్ళు పన్నిన పధకం అని చెప్తునారు. తెరాసా వాళ్ళు ఏమో తెలంగాణా వ్యతిరేకుల పని అని చెప్తున్నారు. ఎవడి పధకం అయితే ఏంటి అండి? కష్టపడేది, నష్టపడేది సామాన్యుడే. వాడి ఘోష ఎవడు పట్టించుకుంటాడు చెప్పండి ?
0 comments:
Post a Comment