Wednesday, October 28, 2009

అదన్నమాట! : అక్టొబెర్ 18-24

1. ఆంధ్రుల అభిమాన హాస్య నటుడు శ్రీ కేసీఆర్ గారు ఈ వారం సరి కొత్త సినిమా ని విడుదల చేసారు. ఈ సినిమా లో విలన్ శ్రీ నార చంద్రబాబు నాయుడు గారు. టిడిపి నేతలు ఉరికే ఉండక, కేసీఆర్ ని రాజీనామా చెయ్యమన్నారు. అంతే, మన అభినమ హాస్య నటుడు పాత్రికేయ సమావేశం పెట్టి, నాకన్నా ఎక్కువ సార్లు రాజీనామా చేసిన మగాడు ఎవరైనా ఉన్నాడా అని ప్రశ్నించారు! రాజీనామా చెయ్యడమే మగతనం అనిపించుకుంటే, నిజమే, మీ అంత మాడు ఎవడు లేడు మొత్తం రాష్ట్రం లో! రాజశేఖర్ ఒకప్పుడు మగాడు అనే సినిమా తీసారు, పెద్ద హిట్ కుడా అయ్యింది. కాని కేసీఆర్ గారి సినిమా ఆ సినిమా రికార్డ్స్ ని తప్పక బద్దలు కొడుతుంది లెండి! వచ్చే వారం ఎం సినిమా విడుదల చేస్తారో వేచి చూద్దాం మరి.

2. ఈయన సినిమా ఇలా ఉంటె, కాంగ్రెస్స్ పార్టీ లో ఇంకో సినిమా నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా ప్రకటించారు - తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం లేడు కాబట్టి, ఇక మీదట ప్రభుత్వాన్ని ఇరకాటం లో పెడుతూనే ఉంటాను అని! వైఎసార్ హామీ ఇచ్చిన రెండు పధకాలు ఇంకా అమలుకు నోచుకోలేని పరిస్థితి ఉంది అంటే, పోరాడాల్సిన అవసరం ఉంది అని సెలవు ఇచ్చారు. అయితే నాకు ఒక డౌట్. ఆ రెండు హామీలు వైఎసార్ గారు ఉన్నప్పుడు కూడా అమలు కాలేదు కదా. స్వయంగా వైఎసార్ గారే చెప్పారు కదా, ఇచ్చిన హామీలు అయుదు ఏళ్ళల్లో ఎప్పుడు అమలు చేసిన పర్వాలేదు అని, మరి అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ?

3. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వంచిన పాత్రికేయుల సమావేశం చుస్తే, చిరాకు వచ్చింది. మంత్రులు అంత బాహాటంగా అయన పక్కన నుంచుని ఉండడం ఎటువంటి సంకేతాల్ని ఇస్తుంది అండి? సాక్షాతూ హొం మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి లాంటి వారు కూడా ఎం చెప్పాలో జగన్ కి చెప్తూ ఉంటె చాలా ఎబట్టు గా ఉంది. జగన్ గారు అసలు రోశయ్య గారి పేరు తీసుకోకపోతే, దానం నాగేందర్ గుర్తు చెయ్యవలసి వచ్చింది. అప్పుడు కూడా, జగన్ గారు పెద్ద హీరో లాగ, ఇప్పుడు ఉన్న రోశయ్య గారికి కాని, లేదా అధిష్టానం నిర్యయించే ఏ ముఖ్యమంత్రి కి అయినా పూర్తి మద్దత్తు ఇస్తూనే, వైఎసార్ గారి పధకాలు అమలు అయ్యే వరకు పోరాడుతూనే ఉంటాము అని సెలవు ఇచ్చారు. ఎమెల్యేలు అయితే ఇక చపట్లు కూడా కొడుతునారు ఏంటో మరి ! సాక్షి టీవీ మరియు పత్రిక కూడా ఇంకా ఇదే పంధా లో వెళ్తునాయి లెండి. కర్నూల్ లో ఇంకా బురద ఉంది, ప్రభుత్వం ఎం చేస్తుంది అని సాక్షి టీవీ లో ప్రస్నిచడం జరిగింది. ముందు మీరు మీ ప్రభుత్వం మీదే బురద జల్లడం ఆపితే, ఆ బురద సంగతి ప్రభుత్వం చూసుకుంటుంది లెండి.

4. కోనేరు హంపి ఏ వారం కొన్ని స్సంచలనాత్మకమైన నిజాలు బయట పెట్టింది అండి. తనిఖీ మనశాంతి లేకుండా ఆంద్ర ప్రదేశ్ చెస్ అధికారులు చేస్తున్నారు అనేది దాని సారాంసం. కాని మన దేశాన్ని కి పట్టిన దరిద్రం ఇదే కదా అండి, ఆ అధికారుల్ని ఎవరు శిక్షించారు. హంపి దే తప్పు అని చిత్రకరించి తప్పించుకుంటారు. ఇలా అయితే ఇక మన దేశం లో ఆటలకి భావిస్యతు ఏమి ఉంటది లెండి ?