కిందటి వారం మనం ఇంటర్ మీడియాట్ రెండో సంవత్సరం ఫిసిక్స్ పేపర్ మీద ఎంత రభస జరిగిందో చూసాం. అక్కడితో ఆ రభస ఆగలేదు అండి ! ముందు ఇచ్చిన పేపర్ కష్టం గా ఉంది అని చరిత్ర లో మొదటి సారి ఇంప్రూవ్మెంట్ పరీక్ష పెడతాము అన్నారు. అదీ చెప్పిన తరువాత, ఇంప్రూవ్మెంట్ పరీక్ష లో వచ్చిన మార్కులని మాత్రం రాంకుల కోసం పరిగనం లోకి తీసుకోము అన్నారు !
ఇంజినీరింగ్ మరియు మెడికల్ సీట్ల కోసం జరిగే కౌన్సిలింగ్ కి ర్యాంకులే ఆధారం. 25% ఇంటర్ మార్కులు, 75% ఎంసెట్ మార్కులు కలిపి ర్యాంకుల్ని ప్రకటిస్తారు. మొదటి దఫా కౌన్సిలింగ్ కోసం మాత్రం పాత మారుకుల్నే పరిగనం లోకి తీసుకుంటాము అని ముంది సెలవు ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు. ఇంకా ఎందుకు అండి పరీక్ష పెట్టి ?? ఇంప్రూవ్మెంట్ రాసేది మంచి మార్కులు వస్తాయి అని ఆశ తో! కొంచం పెద్ద దుమారం ఈ రేగింది ఈ విషయం మీద. అప్పుడు మళ్ళి మంత్రులు సమావేశం అయ్యి, ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు వచ్చాకే ర్యాంకులు ఇస్తాము అని చెప్పారు.
మొత్తానికి ఈ సంవత్సరం లక్షలాది విద్యార్ధులకి తిప్పలు తప్పలేదు మరి! అదన్నమాట!
0 comments:
Post a Comment