అనుకున్నట్టు గానే ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్స్ కి మరియు తెలుగు దేశం కి చెడు అనుభవాలను మిగిల్చాయి. మొత్తం ఏడు స్థానాల లోను ఈ రెండు పార్టీలు ఒక్కటి కూడా గెలవలేదు. నాలుగు స్థానాలు తెరాసా గెలుచుకున్నది. ఒక్క దాంట్లో తెరాసా మద్దతు తో నాగం జనార్ధన రెడ్డి గెలిచారు. ఒక స్థానం లో భారతీయ జనత పార్టి అభ్యర్ది గెలుపొందారు. మహబూబ్ నగర్ స్థానం లో భాజపా గెలిచింది - మిగతా పార్టీల నుంచి గట్టి పోటి వచ్చిన సరే, ఈ స్థానం లో నెగ్గింది. విశేషం ఏమిటి అంటే, ఈ నియోజకవర్గం శ్రీమాన్ కేసీఆర్ గారి లోక్ సభ పరిధి లోనే వస్తుంది !
ఇక పొతే, కొవ్వుర్ లో అనుకునట్టు గానే జగన్ పార్టి అభ్యర్ది ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలిచారు. దాదాపు 23,000 వోట్ల తేడా తో గెలిచారు. దీనితో ఇంకా జగన్ పార్టి వాళ్ళు సంబరాలు జరుపుకున్నారు. రాబోయే 18 సీట్ల ఎన్నికలలో కుడా గెలుస్తాము అనే ధీమా ఇప్పుడు వీరిలో ఏర్పడింది. ఇక పొతే - తెలుగు దేశం మరియు కాంగ్రెస్స్ పార్టీలు ఈ ఫలితాలని తట్టుకోలేక్పోతున్నాయి. గతం లో వారు గెలిచినా రెండు స్థానాలలో తెలుగు దేశం ఈ సారి డిపాసిట్ కూడా కోల్పోయింది !
కాంగ్రీ పార్టి లో ఎప్పుడు ఉండే అంతర్గత కుమ్ములాట మళ్ళి తెర పైకి వచ్చింది ! ముఖ్యమంత్రి గారే బాధ్యులు అని ఒక వర్గం దాడి చేస్తే, కాదు ఆయన గొప్ప వారు అని ఇంకో వర్గం ఎదురు దాడి చేస్తుంది! ఇప్పుడు జరిగిన ఏడు స్థానాలకే ఇలా కొట్టుకుంటే, రేపు పొద్దున్న 18 స్థానాలు ఓడిపోయినప్పుడు కాంగ్రెస్స్ పరిస్థితి ఎలా ఉంటాదో మరి! అదన్నమాట!
0 comments:
Post a Comment