Sunday, June 12, 2011

అదన్నమాట! : జూన్ 5-11

రాష్ట్ర కాంగ్రెస్స్ అద్యక్షుడు గా బొత్స సత్యనారాయణ ని ఈ వారం మ్యాడం నియమించారు. ఆయన చాల అట్టహాసంగా ప్రమాణ స్వీకర కార్యక్రమం చేపట్టాలి అని నిర్ణయించారు. ఇంత వరకు అంతా బానే ఉంది. ప్రమాణ స్వీకారం రోజూ హైదరాబాద్ మొత్తం జెండాలు, పోస్టర్లు అతికించారు. చాలా వాటిలో కనీసం వైఎసార్ గారి బొమ్మ అస్సలు లేదు! ప్రమాణ స్వీకారం జరిగింది గాంధి భవన్ లో. ఎక్కడ వైఎసార్ బొమ్మ లేదు. వేదిక వెనుక చాల పెద్ద పోస్టర్ పెట్టారు. రోశయ్య, కేకే , ఆఖరికి వెంకటసామి బొమ్మ కూడా పెట్టారు. కొత్త అధ్యక్షుడు, శ్రీ బొత్స గారు కాని, ముఖ్యమంత్రి గారు కాని, కనీసం వైఎసార్ గారి పేరు కూడా ప్రస్తావించలేదు.

అసలు ఇంత సిగ్గు లేకుండా ఎలా ఉంటారు అండి ఈ రాజకీయ నాయకులు ? వీళు రెండు సార్లు అధికారం లోకి వచ్చారు అంటే, వైఎసార్ గారి చలవే. అధికారం లోకి వచాక, విచ్చల విడి గా సంపాదించారు అంటే, వైఎసార్ వల్లే. బొత్స గారు అప్పట్లో వోక్స్ వాగెన్ కుంభకోణం లో ఇరుకునప్పుడు ఆయనను కాపిడింది వైఎసార్ గారే. మొన్న ఆ మధ్య ధర్మాన ప్రసాద రావు గారు శ్రీకాకుళం లో ఏమో అభివృధి పనులు అన్ని సోనియా గాంధి చలవే అని సెలవు ఇచ్చారు. ఇంత చండాలమైన మనస్తత్వం ఉండే ఈ కాంగ్రెస్స్ నాయకులు త్వరగా ఓడిపోవాలి అండి. వీలకి తెలిసి రావాలి అండి - వల్ల ఎదుగుదల కి దోహద పడిన వ్యక్తీ ని విస్మరిస్తే ఏమి జరుగుతుందో.

అలాగని వైఎసార్ గారి కొడుకు జగన్ గారు గెలవాలి అని కోరుకోవటం లేదు అండి. అయన వస్తే ఇంకా సర్వ నాశనం మన రాష్ట్రం. ఈ కాంగ్రెస్స్ నాయకులు మాత్రం సోనియా గాంధి, రాహుల్ గాంధి, రాజీవ్ గాంధి నామ స్మరణ తో శేష జీవితం గడిపెస్కుంటారు ఏమో.

1 comments:

pavan said...

In politics........the first lesson is to leave shame......

Post a Comment