Thursday, January 13, 2011

ఎక్కడ ఆ నాయకుడు ?

గత ఏడాది కాలం లో కనీసం 250 రోజులు , టీవీ లో ఒకటే టాపిక్ మీద చర్చ. పొద్దున్న టీవీ పెడితే చాలు. ఈ ఛానెల్ , ఆ ఛానెల్ అని తేడా లేకుండా ; ఈ పార్టి ఆ పార్టి అని తేడా లేకుండా; ఈ విశ్లేషకుడు ఆ విశ్లేషకుడు అని తేడా లేకుండా ; ఈ యాంకర్ , ఆ యాంకర్ అని తేడా లేకుండా - చూస్తున్న వారు ఏమైపోతారో అన్న కనీస మర్యాద లేకుండా ఒకటే టాపిక్ మీద చర్చ - తెలంగాణా.

ఒక్కో పార్టి ది ఒక్కో పంధా . పదే పదే వాళ్ళ వాదనలు వినిపించడం , తిట్టుకోవడం, అరుచుకోవడం , అప్పుడు అప్పుడు నవ్వుకోవడం - ఇలా కనీసం 250 రోజులు గడిచాయి. ఎప్పుడైనా ఒకటే టాపిక్ బోర్ కొడుతుంది అని అనిపిస్తే, జగన్ వర్గాన్ని పిలవడం . మళ్ళి తిట్టుకోవడం, అరుచుకోవడం, నవ్వుకోవడం, వెళ్ళిపోవడం ! అడపా దడపా రాష్ట్ర సమస్యలు మీద చర్చించికోవడం. ఏ రాష్ట్రానికి అయిన, సమస్యలు ఉండకుండా ఉండవు. వాటి తీవ్రత మాత్రం మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అత్యంత క్లిష్ట పరిస్థితులు వస్తు ఉంటాయి. అటువంటి సమయాల్లో, ముందు ఉంది ధైర్యం గా నడిపించా గలిగే నాయకుడు ఉంటె, వాటిని అధిరోహించి, రాష్ట్రం కాని దేశం కాని ముందుకి సాగుతుంది.

మన రాష్ట్రం ప్రస్తుతం ఎదురుకుంటున్న పరిస్థితులు ఆ కోవ లోకే వస్తాయి. కాని ఎక్కడ మన నాయకుడు ? ఇదిగో - ఈయన వస్తే మనం చూస్తున్న గడ్డు రోజులు ఇక మరిచిపోవచ్చు అనే నాయకుడు ఎక్కడ? ఒక ముఖ్యమంత్రి ఆకస్మిక మరణం ఇన్ని అనర్ధాలకు దారి తీస్తుంది అని అసలు ఎవరైనా ఊహించారా ? రోశయ్య గారు రాష్ట్ర వ్యవహారాలు చూసుకున్నారు కాని రాష్ట్రానికి నాయకత్వం అందిచలేక పోయారు. అయన రాజీనామా చేసేసారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పని తీరు గురుంచి ఇప్పుడే ఏమి చెప్పలేము. కాని ఆరంభం మాత్రం బాగాలేదు. దాదాపు మూడో వంతు మంత్రులు వాళ్ళ శాఖలతో సంతృప్తి గా లేరు. జగన్ గారు ఏమో రోజుకో డైలాగ్. మొన్న ఏమో 24 మంది ఎమఎల్యేల మద్దతు ఉంది అని చూపించుకున్నారు - కాని ప్రభుత్వాన్ని పడగొట్టారు అంట. ఎలాగో ఈ ఎమ్యెల్యేలు రాజీనామా చెయ్యరు కదా అనే ధైర్యం తో కాంగ్రెస్స్ పార్టి ఉంది. ఎంత మంది మద్దతు ఇస్తారో, ఎంత మంది ఇవ్వరో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఏ ముఖ్యమంత్రి సవ్యంగా పని చెయ్యగలరు అండి ?

ఇక పొతే తెలంగాణా అంశం. ఇది కేవలం రాజకీయ సమస్య. ప్రధాన పార్టీలు నిలువునా చీలిపోయి ఉన్నాయి. ఆయా ప్రాంతం వారు వారి ప్రాంతానికి అనుగుణంగా, రోజూ ప్రకటనలు ఇస్తున్నారు. చంద్రబాబు ప్రజల్లో తిరుగుతున్నారు కాని, ప్రస్తుత సమస్య కి అయన వద్ద కూడా సమాధానాలు లేవు. ఇక చిరంజీవి గారి సంగతి సరే సరి.

శ్రీ కృష్ణ కమిటి నివేదిక, కూలంకుషంగా అన్ని విషయాలు చర్చించింది. కాని వాటిని అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత రాజకీయ నాయకులది . విడగొడితే, అందరికి ఆమోదయోగ్యంగా ఎలా విడగొట్టాలి? సమైఖ్యంగా ఉంటె, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎలా కొనసాగాలి? ఈ అనిశ్చితి ఎన్నాలు ? ఇంకా ఎంత మంది బలి అవ్వాలి ? ఇంకా ఎంత కాలం టీవీ లో మేము అదే చర్చ పదే పదే చూడాలి :D .ఇలాంటి చాల ప్రశ్నలకు సమాధానం మనకి కావాలి. దురదృష్టం ఏమిటి అంటే, ఆ సమాధానాలు ఇచ్చే సత్తా ఉన్న నాయకుడు మనకి కనుచూపు మేర లో కూడా కనిపించటం లేదు. ఈ నాయకత్వ సమస్య ఏ నాటికి తీరేనో ?

1 comments:

venkatesh said...

idi kani jagan vargam chuste maro 3days sakshi tv lo ekkada ah nayakuda ane title petti aadukuntadu manatho.. nxt current affairs lo daniki samadanalu cheppagalge nayakudu varasatva lakshanalunna netha anachivetha..

Post a Comment