Sunday, March 6, 2011

అదన్నమాట!: ఫిబ్రవరి 27 - మార్చి 5

తెలంగాణా గొడవ కి అంతు లేకుండా పోతుంది అండి ! సహాయ నిరాకరణ గొడవ ఒకటి చేసారు తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులు. ఆఫీస్ కి వెళ్ళకుండా, ధర్నాలు చేసారు. పదిహేను రోజులు కన్నా ఎక్కువగా ఈ పని చేసారు. ముఖ్యమంత్రి, మంత్రులకి కూడా జీతాలు పడలేదు అంట, ఈ సమ్మె వల్ల !!! ముందుగ మంత్రులు మాట్లాడారు, ఈ సమ్మె నాయకులు వినలేదు. తరువాత ముఖ్యమంత్రి తో మాట్లాడారు, అప్పుడు సమ్మె విరమనకి ఒప్పుకున్నారు. అసలు సమ్మె ఎందుకు చేసారో, ఎందుకు విరమించారో అసలు తెలియనే లేదు ! కొంత మంది క్రింది స్థాయి ఉద్యోగులు ఇంకా సమ్మె నడపడం లో ఉద్దేశం ఏమిటి అని ప్రస్నిన్చినట్టు సమాచారం. నెల తిరగక, జీతం పదందే, గడవడం కష్టం. ఇలాంటి సమయం లో సమ్మె అవసరం లేదు అని వాళ్ళ వాదన.

ఇది ఇలా ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి వంద రోజులు అయ్యింది. ఈ వంద రోజులలో చెప్పుకోదగ్గ ఒక్క పని కూడా చెయ్యలేదు. తెలంగాణా గోదావాలని మాత్రం ఆపలేకపోయారు. అసెంబ్లీ లో కూడా తెలంగాణా గొడవే. కాంగ్రెస్స్ ఎమఎల్యేలే రచ్చ చేస్తునారు అసెంబ్లీ లో. ప్రతిపక్షం వాళ్ళు ఊరుకుంటార మరి ? అసలు కనీస చొరవ కూడా చూపించటం లేదు మన ముఖ్యమంత్రి గారు! అదన్నమాట!

0 comments:

Post a Comment