Sunday, February 13, 2011

అదన్నమాట! - ఫిబ్రవరి 6-12

ఆంధ్రుల అభిమాన హాస్య నటుడు శ్రీ కేసీఆర్ గారు ఒక ప్రాతన చేసారు - ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెడతారు అంట! అసలు అవిశ్వాస తీర్మానం పెట్టాలి అంటే కనీసం 30 మంది ఎమ్యెల్యేలు ఉండాలి ! ఈయనికి ఏమో 16 ఉన్నారు! ఏదో ఒకటి సంచలనం సృష్టించకపోతే, ఈయనికి నిద్ర పట్టదు ఏమో.
"ఆంధ్రుల అభిమాన హాస్య నటుడు" అనే బిరుదుకి ఇప్పుడు చిరంజీవి గారు కుడా గట్టి పోటి ఇస్తున్నారు ! పార్టీ జెండా ఎత్తేసాక, కాంగ్రెస్స్ నేతలని కలిసి అప్పుడే మ్యాడం గారిని పొగడడం మొదలు పెట్టారు! రోజుకో మాట చెప్తూ, త్వరలో ఈ బిరుదు ని సొంతం చేసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి !
ఇది ఇలా ఉండగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన "రచ్చబండ" కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజల లోకి వెళ్లి వల్లాతో నేరుగా సంభాషిస్తున్నారు. మంత్రులు కూడా అంతే. తెలంగాణా లో కొన్ని ప్రాంతాలల్లో కొంత మంది అల్లర్లు చేసారు కాని, మొత్తం మీద బానే స్పందన వచ్చింది ఈ కార్యక్రమం కి. పెద్ద ఎత్తున్న టీవీ లో వాణిజ్య ప్రకటనలు కూడా ఇప్పించారు ! జగన్ సిబరం నడిపిస్తున్న ప్రచారానికి అడ్డు కట్ట వెయ్యడానికి గట్టిగానే ప్రయిత్నిస్తున్నారు మరి !

0 comments:

Post a Comment