Sunday, November 15, 2009

అదన్నమాట! : నవంబర్ 8-14

1. "జాగో తెలంగాణా వాలో, భాగో ఆంద్ర వాలో " అని ఆంధ్రుల అభిమాన హాస్య నటుడు శ్రీ కేసీఆర్ గారు మొన్న ఆ మధ్య సెలవు ఇచ్చారు. ఈ ఉద్యమానికి ఈ వారం నాంది పలుకుతునట్టు కూడా చెప్పడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా లోని ఒక గ్రామం లో తెరాసా కార్యకర్తల్లు అందరు వచ్చారు. రోజు అంతా వేచి చూస్తూనే ఉన్నారు. అయిన సరే, శ్రీ కేసీఆర్ గారు దర్శన భాగ్యం కలగలేదు. ఎందుకంటే, ఎప్పటి లాగ కేసీఆర్ తన కార్యకర్తలను మభ్య పెట్టి, చివరకు మోసం చేసారు కాబట్టి! అందుకే మరి, ఆయనకు ఆంధ్రుల అభిమాన హాస్య నటుడు అని బిరుదు ఇచ్చింది!

2. కిందటి వారం ఏమో కాంగ్రెస్స్ తో పెతు కు సిద్దం అని చిరంజీవి గారు సెలవు ఇచ్చారు. ఈ వారం ఏమో కాంగ్రెస్ దుష్ట పాలనను అంతం చేద్దాం అని సెలవు ఇచ్చారు. ఒక పక్క ఇలా చెబుతూనే, ఇంకో పక్క బామర్ది అరవింద్ ని కెవిపి తో చర్చలకు పంపిచారు. తమ్ముడు పవన్ కళ్యాన్ దుబాయ్ లో ఉన్నాడు ఏమో, కనుక ప్రచారం కి రాకపోవచు ఏమో అని కూడా చెప్పారు. మొత్తానికి చిరంజీవి కి, తమ్ముడు ఏమి చేస్తునాడో తెలిదు, బామర్ది ఎం చేస్తునాడో తెలిదు, చివరకు తనే ఎం చేస్తునాడో తెలియని పరిస్థితి .

3. "గాలి" దుమారం బానే వీస్తుంది రాష్ట్రం లో. గాలి జనార్ధన్ రెడ్డి గారి మైనింగ్ కంపెనీ మీద ప్రతి పక్షాలు దాడిని పదును చేసాయి. అయితే వాళ్ళ సొమ్ము ఏదో పోయినట్టు గా బాధ పడిపోతూ కాంగ్రెస్స్ నాయకులూ గాలి గారికి తెగ సంఘీభావం ప్రకటించారు లెండి ! అంతే కదా మరి, జగన్ గారి సొమ్ము పోతుంటే, వీళ్ళ సొమ్ము పోయినట్టే కదా!

4 పదహారో అంతర్జాతీయ బాలల దినోత్సవం ఆరంభోత్స్వంలో దాసరి నారాయణ రావు గారు తెలుగు సినిమా ప్రతిష్త గురుంచి తెగ ఉగిపోతూ చెప్పారు. ఈయన ఇంత లా ఎమోషనల్ ఎందుకు అవుతున్నాడో అర్హం కాలేదు ముందల. తరువాత అయన చెప్పారు. దర్శకుడు అయన తనను నిర్మాత గా వేదిక మీద పరిచయం చేసారు అంట! అంతే లెండి, మీ వరకు వస్తే కాని, మీకు అర్ధం కాదు !

5 తెలుగు దేశం పార్టి, లోక సత్తా మీద తెగ ఆరోపణలు గుప్పించడం మొదలు పెట్టింది ఈ వారం లో. ఎన్నికల ఫలితాలే తెలుస్తాయి, తేదాప నడుపుతున్న ఈ నెగటివ్ ప్రచారం ఎంత వరకు సఫలీకృతం అవుతుందో అని!

0 comments:

Post a Comment