Sunday, November 8, 2009

అదన్నమాట!: నవంబెర్ 1-7

1. గత ఏడాది, శ్రీమాన్ చిరంజీవి గారు అవినీతి ని ప్రక్షాళన చేస్తాను అని ప్రగల్భాల్లు పలికారు. ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీ తో పొత్తు కి సిద్దం అయ్యారు. పీఆర్పీ ఎంత అధోగతి కి దిగజారిందో ఇంత కన్నా చక్కటి ఉదాహరణ దొరకదు ఏమో. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కోసం ఒక రోజు కాంగ్రెస్ మరియు పీఆర్పీ పార్టీలు పొత్తు పెట్టుకునట్టు ప్రకటించాయి. మరుసటి రోజు మధ్యానం, పీఆర్పీ రాజకీయ వ్యవహారాల కమిటీ పొత్తు కి ఆమోద ముద్ర వేసింది. కోటగిరి విద్యాధర్ రావు గారు అయితే, ఏకంగా 2014 ఎన్నికల్లు వరకు కూడా పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్దం గా ఉన్నట్టు ప్రకటించారు. ఈ లోపల కాంగ్రెస్ పార్టీ లో లుకలుకలు మొదలు అయ్యాయి. జగన్ వర్గాన్ని తోక్కేయడానికే సీనీయర్లు ఈ కుట్ర పన్నారు అని తెగ దుమారం రేగింది. ఇదంతా చూసి హడిలిపోయిన అధిష్టానం ... అబ్బెబే పొత్తు లాంటిది ఏమి లేదు అని ప్రకటించేసింది ! చిరంజీవి గారికి బహుశా మొహం ఎక్కడ పెట్టుకొవాలో అర్ధం అయ్యి ఉండదు! ఇంత జరిగిన సరే, చివరి నిమిషం వరకు పొత్తు జరగోచు ఏమో అన్న ఆస తో ఆయన ఉన్నట్టు సమాచారం. అంతే కాకుండా మధ్యలో కోటగిరి విద్యాధర్ రావు అసలు పీఆర్పీ పోటియే చెయ్యకపోవచ్చు అని చెప్పారు. కార్యకర్తల ఆగ్రహం చూసి, దిక్కు తోచని స్థితి లో ౫౧ సీట్లు కి అభ్యర్ధుల్ని ప్రకటించారు. మార్పు తెచ్చేస్తా, పీకేస్తా, బరికేస్తా అని కోతలు కుసినందుకు ఇప్పుడు మీకు సిగ్గు వెయ్యటం లేదా చిరంజీవి గారు ?

2. ఇది ఇలా ఉంటె, కాంగ్రెస్ వాళ్ళు వెనకటి రోజుల్ని మళ్ళి మనకి గుర్తు చేసారు! గ్రూపులు గా విడిపోయి, బాహాటంగా కొట్టేసుకుని, మహిళ అని చూడకుండా కూడా చేయిచేసుకుని, బహిరంగంగా ఒకర్ని ఒకరు తిట్టుకుని, రాజీనామాలు ఇచ్చేసి, చొక్కాలు చింపెస్కుని, ... అబ్బో ఒకటా రెండా, అసలు ఈ వారం లో వీళు ఇచినంత ఎంటర్తైన్మెంట్ ఎవరు ఇవ్వలేదు ! ఎంఎల్యే ని కూడా తరిమి కొట్టారు. వైఎసార్ ముఖ్యమంత్రి కాకముందు పార్టీ ఎలా ఉండేదో, మళ్ళి ఈ నాయకులూ మనకి గుర్తు చేసారు. ఇంత నీచమైన వికృతమైన చేష్టలు చెసినా, ఎవరికీ శిక్ష పడదు, ఇది అంతా రాజకీయం లో ఒక భాగమే అని కొట్టి పారేస్తాము, మళ్ళి ఇలాంటి చెత్త సంఘటనలు జరిగే వరకు ఆగుతాం. ఎటువంటి సంస్కారం ని నేర్పిస్తునం అండి మనం ?

3. ఆంధ్రుల అభిమాన హాస్య నటుడు శ్రీ కేసీఆర్ గారు ఈ వారం ఎం చెప్పారు అంటే - తెలంగాణా వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో !ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు అంట! ఎప్పుడు ఏంటి అని చెప్పలేదు. చేస్తారు అంట లే. వేచి చూడడం తప్పించి మనం పెద్దగ చేసేది ఏమి లేదు లెండి !

౪. ఇప్పుడే స్టార్ నైట్ చూసా. దాసరి నారాయణ రావు కి చాలా రోజుల తరువాత మైక్ దొరిక్నట్టు ఉంది. చాలా టార్చర్ పెట్టారు అండి బాబు !

1 comments:

Anonymous said...

natulu nayakulayyaru (Chiru), nayakulu Natistunnaru ( KCR ) ante kaani Janalaku prayajonam undadam ledu.

-Vara

Post a Comment