Sunday, November 1, 2009

అదన్నమాట!:అక్టొబెర్ 25-31

1. ఆంధ్రుల అభిమాన హాస్య నటుడు శ్రీ కేసీఆర్ గారు ee వారం మన అందరికి బాష ప్రయోగం మీద జ్ఞానోదయం కలిగించారు. ఒక సంస్కరవంతుడి లాగ మాట్లాడడం లేదు అని అయన పైన వస్తున్నా విమర్శల్ని తిప్పి కొడుతూ మనకి కొన్ని అమోఘమైన విషయాల్ని ని సెలవు ఇచ్చారు. తెలంగాణా లో "బద్మాష్", "లుచ్చా", "బేకార్" ఇత్యాది పదాలు రోజు వాడుక లో ఉంటాయి, కాబట్టే అయన కూడా అవే పదాలు వాడుతున్నారు అంట. మా బాష అటువంటిది రా భాయి అని చెప్పి సమర్దించుకున్నారు. మొత్తానికి ee వారం కూడా అయన మనకి ఒక సూపర్ హిట్ సినిమా అందించారు. వచ్చే వారం లో విడుదల అయ్యే సినిమా కోసం వేచి చూద్దామా మరి?

2. ఈయన వ్యవహారం ఇలా ఉంటె, ఈ మద్యనే కనుమరుగు అయిపోయారు అని అనుకుంటున్న ఇంకో హాస్య నటుడు మళ్ళి తెర మీదకి వచ్చారు. ఆయన పేరు ఎస్ ఎస్ పి యాదవ్. డిజిపి పదవి నుంచి ఆయనను తోలింగ్చడం పై కేసు వేసారు. ప్రస్తుత డిజిపి గా ఉన్న గిరీష్ కుమార్ నియామకం చెల్లదు అని, అసలు ఆయనకి 2007 లో ఇచ్చిన ప్రమోషన్ ఏ తప్పు అని కేసు లో పేర్కున్నారు. మరి 2007 లో ప్రమోషన్ ఇచ్చింది ఈయనే కదా అనే అనుమానం కలగడం సహజమే. అప్పుడు ఆ ప్రమోషన్ వాళ్ళ తణుకు ఎలాంటి నష్టం లేదు కాబట్టి తను ఎక్కువ ఆలోచించలేదు అంట! బాగుంది అండి. మీరు రూల్స్ ఉల్లంఘిస్తే మిమ్మల్ని ఏమి అనకూడదు. వేరే వాళ్ళు ఉల్లంఘించారు అని మీకు అనిపిస్తే విర్రవీగుతారా?

3. ఎట్టకేలకు కొండా సురేఖ గారు రాజీనామా చేసారు. కొంచం రసవత్తరం గా ఉంటది అని, ఆమె నేరు గా గవర్నర్ కే రాజీనామా ఇచ్చారు. మరి కొంచం రసవత్తరం గా ఉంటది అని, లేఖ లో కమ్మ కులం వాళ్ళు జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఆపుతున్నారు అని, చంద్రబాబు నాయుడు, సీపీఎం, సేపేఇ నేతలు కూడా కుమ్మకు అయ్యారు అని రాసారు. కమ్మ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు. వాళ్ళు చెలరేగిపోతున్నారు. మధ్యలో మమల్ని ఎందుకు లాగుతున్నారు అంటు తెదేపా, సేపేఇ, సీపీఎం వాళ్ళు చెలరేగిపోతున్నారు. జర్నలిస్ట్లు ఎందుకు ఊరుకుంటారు, అసలు ఒక కులం పేరు ఎలా ప్రస్తివిస్తారు అని వాపోతున్నారు. కొండా సురేఖ గారు మాత్రం, నిప్పు పెట్టి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు!

0 comments:

Post a Comment