బహుశా రాష్ట్ర చరిత్ర లో రోశయ్య గారు ముఖ్య మంత్రి అయిన పరిస్థితుల్లో ఎవ్వరు ముఖ్యమంత్రి అవ్వలేదు ఏమో. అంతటి సంక్లిష్ట సమయం లో , ఈయనే అయ్యారు. అవ్వడమే తరువాయి, సమస్యల మీద సమస్యలు వచ్చి పడ్డాయి. వైఎసార్ మరణాంతరం ముఖ్యమంత్రి అవ్వడం అనేది పెను సవాలే మరి. రాష్ట్ర విభజన జరిగినట్టే జరిగి ఆగిపోయింది! ఇక రాజకీయ సవాళ్ళు షరా మామూలే. వీటన్నిటిని 14 నెలలు నెట్టుకు వచ్చారు. ఇక చెయ్యలేను అని సోనియా గాంధి కి చెప్పేశారు. ఆ విధంగా, అయన గత బుధవారం, తన రాజీనామా ఇచ్చేసారు. హాయ్ కమాండ్ కొత్త ముఖ్యమంత్రి గ కిరణ్ కుమార్ రెడ్డి ని నియమించింది. ఉప ముఖ్యమంత్రి గా తెలంగాణా కి చెందినా దామోదరం రాజసింహ ని నియమించింది. పీసిసి అధ్యక్షుడి గా బొత్స సత్యనారాయణ ను నియమించే అవకాశం బానే ఉండి అంట.
అత్యంత నాటకీయ మరియు సోచనీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి అయిన రోశయ్య గారిని చరిత్ర ఎలా గుర్తు పెట్టుకుంటుందో అని చాలా ఆత్రుత గా ఉంది. కాంగ్రెస్స్ వాళ్ళు అయన పేరు ని అసలు చరిత్ర లో ఉంచుతార లేదా అనేది కూడా పెద్ద ప్రశ్నే. రాష్ట్ర చరిత్రే మారిపోయే తరుణం లో రోశయ్య గారు ముఖ్యమంత్రి గా ఉన్నారు. పొరపాటున జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయితే మాత్రం, రోశయ్య గారి పేరుని చరిత్ర పుస్తకలోంచి తీసేఎడం తధ్యం! అదన్నమాట!
2 comments:
pcc adyakshudu ga botsa ni niyamiste ds lane chepurapalli niyojakavargam lo congrs vodipothudi...aayana garu aayana satheemani last time gelvatame ekkuva.. power vunnantha varaku pogadam tarvatha tittadam marchipovadam mana vallaki telsinathaga everki telyadu ga so roshayya ki kuda ade jargutundi
One killed in gas leak blast
Hyd-Sec'bad to get piped cooking gas supply by Dec 2012
I am not too excited.
Post a Comment