Sunday, November 21, 2010

అదన్నమాట! :నవంబర్ 14-20

అసలు మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటో ! మొన్నామధ్య ఏపీపీఎస్సీ పరీక్షలు వాయద వెయ్యమని, తెలంగాణా విద్యార్ధులు రచ్చ చేస్తే, మన ప్రబుత్వం అంచనాలకు భిన్నంగా , గట్టిగా తన మాట మీద నిలబడి, పరీక్షను నిర్వహించింది. అదే సామర్ధ్యం ఇప్పుడు మళ్ళి ప్రదర్శించాల్సిన తరుణం వస్తే, మొహం చాటేసింది !

రాష్ట్రం లో ఎస్సై పోస్ట్స్ కోసం నిర్వహించాల్సిన పరీక్షలను వాయద వేసింది . కారణం - మళ్ళి తెలంగాణా విద్యార్ధుల రచ్చ . రెండేళ్ళు గా వాయద పడుతూ వస్తున్నా పరీక్ష ని ఎత్తి పరిస్థితుల్లో నైన నిర్వహిస్తాము అని చెప్పిన ౨౪ గంటల్లోనే మన ప్రభుత్వం ఇచిన మాట తప్పింది ! 1200 ఖాళీలు ఉన్నాయి. 65000 మంది రాయడానికి సిద్దమయ్యారు. వాళ్ళ ఆసల మీద నీళ్ళు జల్లుతూ, మన ప్రబుత్వం మళ్ళి ఇంకో సారి ఇలాంటి గూండాలకి తలొగ్గింది. తెలంగాణా విద్యార్ధులు సంతోషించారు అంట ఈ వార్త విని ! కేవలం ఉస్మానియా విద్యార్ధులు సంబరాలు జరుపుకుంటే, మొత్తం తెలంగాణా వాళ్ళు జరిపినట్ట అండి? ఎంతో మంది ఈ పరీక్ష కోసం వేచి చూసారు, వాళ్ళ సంగతి ఏమిటి మరి? ఎన్నాళ్ళు ఇలాంటి హింసా వాదుల అరాచకపు వ్యవహారాలని సహించాలి ? సీమాంధ్ర ఏమో అట్టుడికింది అంట ! మళ్ళి అదే కధ. అదే ప్రబుత్వం ! ఈ దరిద్రం ఎన్నాలో? దీని నుంచి విముక్తి ఎప్పుడో ?
ఇది ఇలా ఉండగా, సాక్షి టీవీ మొన్న ఒక గంట పాటు సోనియా గాంధి మీద ఒక కధనం ప్రసారం చేసింది అంట. విచ్చలవిడి గ తిట్టి పోసింది అంట మ్యాడం గారిని !! నవ్వలేక సచ్చాను అండి బాబు ! ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎంత కాంగ్రెస్స్ కి వ్యతిరేకం గా వ్యవహరించినా, నీచమైన పదజాలం వాడలేదు. మన జగన్ గారి సాక్షి టీవీ ఆ గీత ని కూడా దాటి నట్టు ఉండి ! ఇంకా కాంగ్రెస్స్ లో ఇప్పుడు పోటి పడి మరి, నాయకులు జగన్ ని తిడుతున్నారు ! ఎంతైనా మ్యాడం కి తమ విశ్వాసం ప్రదర్శించాలి కద ! అదన్నమాట!

0 comments:

Post a Comment