భారత రాష్ట్రపతి గా వెంకయ్య నాయుడు గారిని ఎంపిక చెయ్యలేదు అని మన ఆంధ్రజ్యోతి వాళ్ళు చాలా బాధపడ్డారు. మోడీ కి ఎంత అండగా నుంచున్నా సరే వెంకయ్య కి మొండి చెయ్యి చూపారు అని పత్రిక లొ విశ్లేషించారు.
ఎడిటర్ వెంకట కృష్ణ గారు, ఇంకో ముగ్గురు "మేధావులు" కలిపి, ఒక అరిగిపోయిన రికార్డ్ లాగా చెప్పిందే చెప్పి విసుగు పుట్టించారు. భారత దేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టి, దక్షిణ భారత దేశాన్ని సృష్టించాలి అంట. ఎందుకు?
ఎందుకు అంటే, తెలుగు వాడైన వెంకయ్య నాయుడు నీ ఉత్తరాది పార్టీలు కావాలి అని విస్మరించి, ఓర్రిస్సా రాష్ట్రం కి చెందిన ద్రౌపది ముర్ము నీ ఎన్నికున్నారు అంట. ఈ "మేధావులు" కి కనీసం ఒరిస్సా రాష్ట్రం ఈశాన్యం కింద వస్తుందని తెలియదా? ఉత్తరాది పాలకులు ఈశాన్యం నుంచి ఒకళ్ళని ఎన్నికుంటే, అది దక్షిణానికి అవమనామ? భారత దేశ రాష్ట్రపతి గా దక్షిణ భారతం నుంచి ఇప్పటి వరకు ఆరుగురు ఎన్నిక అయ్యారు. మరి ఇంకా వివక్ష అసలు ఎక్కడ ఉందో ఈ "మేధావుల" సెలవు ఇవ్వాలి.
దేశం అంట గుజరాతీ గుప్పిట్లో ఉంది అంట. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కట్టడానికి 3000 కోట్లు కర్చుపెడతరు కానీ, అల్లూరి సీతారమరాజు విగ్రహానికి 3 కోట్లు పెడతారు అని ఒక "మేధావి" సెలవు ఇచ్చారు. సదరు మేధావి కి పటేల్ విగ్రహం కేంద్ర ప్రభుత్వం కాదు, గుజరాత్ ప్రభత్వం కట్టించింది అని తెలియదా? మన రాష్ట్ర ప్రభుత్వం నీ ఎవరు ఆపారు అండి, అలాంటి పనులు చేయడానికి?
దక్షిణ భారతంలో ఉన్న రాష్ట్రాల సంపద వేరే రాష్ట్రాలు దొచేస్కుంటున్నాయి అంట. ఎవరు? అది మాత్రం సెలవు ఇవ్వలేదు మన "మేధావులు". PV గారికి అన్యాయం ఎందుకు చేశారు అని బిజెపి నీ అడుగుతారు ఈ మేధావుల.
అసలు ఎంటి ఈ దుర్మార్గపు ఆలోచన అని ప్రశ్నిస్తే, వెంకట కృష్ణ గారు ఊగిపోయారు- నన్ను అంత మాట అంటావా? ప్రజాస్వామ్యం లొ ఉన్నాం, నేనూ నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా కానీ నా ఆలోచనలు దుర్మార్గం అనే హక్కు ఎవడికి లేదు అని ఊగిపోయారు! ఇదేం విడ్డూరం!
రేణుకా చౌదరి వెకిలి నవ్వు ని శూర్పణఖ తో పోలిస్తే, దక్షిణ భారతం వాళ్ళని "రాక్షస జాతి సంతతి" అని అర్థం అంట, వెంకట కృష్ణ గారు సెలవు ఇచ్చారు! ఇదేం విడ్డూరం!
"మేధావులు" బాధ పడే ప్రతి సారి దేశాన్ని విడగొట్టడం మీద దృష్టి ఎందుకు పెడతారు? మనోడికి పదవి ఇవ్వలేదు అని పనికిమాలిన చర్చలు పెట్టీ రెచ్చగొట్టడం ఒకటే పనా? దేశం అంటే ఎంటో మనకి తెలీదు అని వెంకట కృష్ణ గారు సెలవు ఇచ్చారు. ఇంత అహంకారానికి కారణం ఏమిటి?
ఆసలు దక్షిణ భారతంలో ఉన్న రాష్ట్రాలు అన్నిటికీ ఒకటే సమస్య ఉంటాయా? ఆసలు ఈ పార్టీలు అన్ని కలిపి ఏమైనా కొత్త దేశాన్ని నిర్మిస్తాయా? అర్థ రహితం లేని చర్చలు పెట్టీ విద్వేషాలు రెచ్చగొట్టే పనులు ఆంధ్ర జ్యోతి మానుకోవాలి.
0 comments:
Post a Comment